నవాజ్‌ షరీఫ్ భార్య కన్నుమూత…

లండన్: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె లండన్‌లో చికిత్స పొందుతూ… ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. కుల్సుమ్ జూన్‌ నుంచి లండన్‌లోని హ్యార్లీ స్ట్రీట్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెకు కృత్రిమ శ్వాసను అందించారు. ఊపరితిత్తుల సమస్య కూడా తలెత్తడంతో చివరకు ఆమె దవాఖానలోనే కన్నుమూశారు. కుల్సుమ్ భర్త నవాజ్ షరీఫ్, […]

లండన్: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె లండన్‌లో చికిత్స పొందుతూ… ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. కుల్సుమ్ జూన్‌ నుంచి లండన్‌లోని హ్యార్లీ స్ట్రీట్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆమెకు కృత్రిమ శ్వాసను అందించారు. ఊపరితిత్తుల సమస్య కూడా తలెత్తడంతో చివరకు ఆమె దవాఖానలోనే కన్నుమూశారు. కుల్సుమ్ భర్త నవాజ్ షరీఫ్, కుమర్తె మర్యమ్ ప్రస్తుతం పాక్ జైళ్లలో ఉన్న సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం జైలుశిక్షను అనుభవిస్తున్నారు. 68 సంవత్సరాల కుల్సుమ్‌కు నలుగురు పిల్లలున్నారు.

Comments

comments

Related Stories: