నలుగురు భారతీయుల కిడ్నాప్

kidnap_manatelanganaలిబియా : ట్రిపోలి సమీపంలో నలుగురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. వీరిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. కిడ్నాప్ అయిన ఈ నలుగురు ట్రిపోలిలో ప్రొఫెసర్లుగా గా పని చేస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్స్ రాలేదని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. కిడ్నాప్ అయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన వారుకూడా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన గోపికృష్ణ , బలరాం ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోపీకృష్ణ, బలరాం ట్రిపోలిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన వారి కుటుంబాలతో టచ్‌లోనే ఉన్నామని విదేశాంగ శాఖ తెలిపింది. లిబియా రాయబార కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని పేర్కొంది. గోపీకృష్ణ కిడ్నాప్‌పై ఆయన భార్య కల్యాణి నాచారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తను రక్షించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Comments

comments