నలుగురు బిటెక్ విద్యార్థుల కథ

శౌర్య, రోహిణి, షకలక శంకర్, రాణి, అశ్విని వైజాగ్ శంకర్, నొవల్ కిషోర్, నిషిత ప్రధాన పాత్రల్లో ఫ్రెండ్లీ ఫిల్మీ ప్రొఫైల్ పతాకంపై శీను ఇమంది దర్శకత్వంలో మధువర్మ, రవి మామిడి, జమ్ముధన, సత్యనారాయణ కాజా, ప్రవీణ బూడి, కిరణ్ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బిటెక్ బాబులు’. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.పి.పట్నాయక్ సినిమా లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్.పట్నాయక్ […]

శౌర్య, రోహిణి, షకలక శంకర్, రాణి, అశ్విని వైజాగ్ శంకర్, నొవల్ కిషోర్, నిషిత ప్రధాన పాత్రల్లో ఫ్రెండ్లీ ఫిల్మీ ప్రొఫైల్ పతాకంపై శీను ఇమంది దర్శకత్వంలో మధువర్మ, రవి మామిడి, జమ్ముధన, సత్యనారాయణ కాజా, ప్రవీణ బూడి, కిరణ్ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బిటెక్ బాబులు’. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.పి.పట్నాయక్ సినిమా లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్.పట్నాయక్ మాట్లాడుతూ “లోగోను చూస్తుంటే దర్శకుడిలో ఎంత క్రియేటివిటీ ఉందో తెలుస్తుంది. ఈ పోస్టర్‌ను చూసే ప్రతి ప్రేక్షకులో సినిమా పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టూడెంట్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది”అని చెప్పారు. దర్శకుడు శీను ఇమంది మాట్లాడుతూ “నాలుగేళ్ల కాలంలో బిటెక్ చదువుతున్న నలుగురి యువకుల ప్రవర్తన నవ్విస్తూ, కవ్విస్తూ ఆనందాన్నిచ్చే చిత్రమిది. సినిమా షూటింగ్ అంతా వైజాగ్‌లోనే జరిగింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టులో ఆడియో విడుదల చేసి సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం”అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ “యూత్‌ను ఎంటర్‌టైన్ చేసే విభిన్న కథాచిత్రమిది. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుంది”అని తెలిపారు. రోషిణి మాట్లాడుతూ “ఈ సినిమాలో నాది కల్ప అనే ఓ ఇన్నోసెంట్ క్యారెక్టర్. సెన్సిటివ్‌గా ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి పాత్రలో కనిపిస్తా”అని అన్నారు. అశ్విని మాట్లాడుతూ “హీరోయిన్‌గా నాకు మంచి పాపులారిటీని తెచ్చే సినిమా ఇది. సినిమా విజయం సాధించి మా అందరికీ సినిమా మంచి పేరు తెస్తుంది”అని చెప్పారు.

Related Stories: