నలుగురు డిఎస్‌పిల బదిలీ

TS-Police-Logo

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నలుగురు డిఎస్‌పిలను బదిలీచేస్తూ డిజిపి మహేందర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ డిఎస్‌పిగా తిరిగి సుధాకర్‌రెడ్డిని నియమిస్తూ… గత నెలలో విజిలెన్స్ డిఎస్‌పిగా బదలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఎసిపిగా జి చక్రవర్తి, మలక్‌పేట్ ఎసిపిగా కె నర్సింగరావును నియమించారు. డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని మలక్‌పేట్ ఎసిపి శివభాస్కర్‌రావును ఆదేశించారు.

Comments

comments