‘నర్తనశాల’తో మరో హిట్ కొట్టేసిన నాగశౌర్య.!

Naga Shaurya's Narthanasala Movie Review
సినిమా: శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య కథానాయకుడిగా, కాశ్మీరా యామిని కథానాయికలుగా ‘@ నర్తనశాల’ సిన్మా తెరకెక్కింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు నాగశౌర్య యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాధాకృష్ణ పాత్రలో నాగశౌర్య అద్భుతంగా నటించాడు. చిన్నప్పటి నుంచి అమ్మాయిలా పెరిగిన అబ్బాయిగా శౌర్య అద్భుతంగా చేశాడని ప్రేక్షకులు అంటున్నారు. ‘గే’ టైపులో నాగశౌర్య పలికించిన హావభావాలు గొప్పగా ఉన్నాయని టాక్. ఇక లుక్ పరంగా అయితే ముందు సిన్మాల కంటే హ్యాండ్సమ్ గా కనిపించాడనే అభిప్రాయాన్ని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. ‘ఛలో’ వంటి సూపర్ హిట్ తర్వాత  ఈ తరహా పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావాలనుకోవడం సాహసమేననీ అంటున్నారు. ఈ పాత్రలో ఆయన మరింత పరిణతితో కూడిన నటనను కనబరిచారు. ఈ సినిమా నాగశౌర్యకి ఎంతటి సక్సెస్  ఇస్తుందో చూడాలి.