నరేష్-నవీన్ విజయకృష్ణల ‘విఠలాచార్య’ ప్రారంభం

డా.నరేష్, నవీన్ విజయకృష్ణ, అనీషా ఆంబ్రోస్, ఇంద్రజ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విఠలాచార్య’. సుహాస్ మీరా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.కె.విశ్వేష్‌బాబు, కె.ఎస్.టి.యువరాజ్, యం.వి.కె.రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కృష్ణ క్లాప్‌నిచ్చారు. విజయనిర్మల కెమెరా స్విచ్చాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా బ్రోచర్స్‌ను కోదండరామిరెడ్డి విడుదల చేసి కృష్ణకు అందించారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడుతూ “విఠలాచార్య చాలా గొప్ప దర్శకులు. ఆయన […]

డా.నరేష్, నవీన్ విజయకృష్ణ, అనీషా ఆంబ్రోస్, ఇంద్రజ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విఠలాచార్య’. సుహాస్ మీరా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.కె.విశ్వేష్‌బాబు, కె.ఎస్.టి.యువరాజ్, యం.వి.కె.రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కృష్ణ క్లాప్‌నిచ్చారు. విజయనిర్మల కెమెరా స్విచ్చాన్ చేశారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా బ్రోచర్స్‌ను కోదండరామిరెడ్డి విడుదల చేసి కృష్ణకు అందించారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడుతూ “విఠలాచార్య చాలా గొప్ప దర్శకులు. ఆయన పేరుతో పెట్టిన టైటిల్ చాలా బావుంది. మా తరతరాలు నటీనటులుగా కొనసాగుతారు. మా పెద్ద మనవడితో పాటు చిన్న మనవడు కూడా ఇందులో నటిస్తున్నాడు”అని అన్నారు. కృష్ణ మాట్లాడుతూ “నేను విఠలాచార్యతో ‘ఇద్దరు మొనగాళ్లు’ అనే సినిమాకు పనిచేశాను. ఆయన చాలా హిట్ చిత్రాలను తీశారు. సక్సెస్‌కు నాంది పిలికే సినిమా ఇది. నరేష్, నవీన్ కలిసి చేస్తున్నారు”అని తెలిపారు. సుహాస్ మీరా మాట్లాడుతూ “నేను పరుచూరి వెంకటేశ్వరరావు దగ్గర రచనలో, గుణశేఖర్ దగ్గర దర్శకత్వ శాఖలో సాంకేతిక విషయాలను నేర్చుకున్నాను”అని అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుహాసి నాకు చెప్పిన వాటిల్లో మంచి స్టోరీ ఇదని తెలిపారు. నవీన్ మాట్లాడుతూ “నా కెరీర్ ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. భవిష్యత్తులో నా సినిమాలను చూసి గర్వపడేలా కథలను ఎంపిక చేసుకుంటాను. సుహాస్ చాలా మంచి కథ చెప్పారు”అని చెప్పారు. నరేష్ మాట్లాడుతూ “వైవిధ్యమైన స్క్రిప్ట్ ఇది. ప్రతి సీను ఆకట్టుకుంటుంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో నా ఇద్దరు కుమారులు నటిస్తున్నారు. మాస్, ఫ్యామిలీ, యూత్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఇందులో మా అమ్మగారు కూడా నటిస్తున్నారు”అని అన్నారు. పోసాని కృష్ణమురళి, రఘుబాబు, రాజా రవీంద్ర, సితార, పరుచూరి వెంకటేశ్వరరావు, శివన్నారాయణ, గిరిధర్, మధునందన్, తాగుబోతు రమేష్, జోగి కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః దాశరథి శివేంద్ర, సంగీతంః సత్య కశ్యప్‌ః ఎడిటర్‌ః కార్తిక శ్రీనివాస్, ఆర్ట్‌ః వినోద్ వర్మ, స్టంట్స్‌ః జాషువా, డ్యాన్స్‌ః నిక్సన్, యాని, పాటలుః పూర్ణాచారి.

Comments

comments

Related Stories: