నరకాన్ని చూపిస్తున్న “ నాటుసారా ”

మహబూబ్‌నగర్: నాటు సారా పేద ప్రజలకు నరకాన్ని చూపిస్తోంది. త్వరగా సారాను తయారు చేయాలనే ఉద్దేశంతో సారా తయారీ దారులు కలుపుతున్న యాసిడ్ లాంటి ప్రమాద కర ద్రవాలతో నాటుసారా తాగి పేద ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పేద ప్రజలు పనులకు వెళ్లకుండా సారా మత్తులో తూగుతూ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామం నాటు సారా దెబ్బకు విలవిలలాడుతోంది. గతంలో నాటు సారా తాగి వందల మంది మృతి […]

మహబూబ్‌నగర్: నాటు సారా పేద ప్రజలకు నరకాన్ని చూపిస్తోంది. త్వరగా సారాను తయారు చేయాలనే ఉద్దేశంతో సారా తయారీ దారులు కలుపుతున్న యాసిడ్ లాంటి ప్రమాద కర ద్రవాలతో నాటుసారా తాగి పేద ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పేద ప్రజలు పనులకు వెళ్లకుండా సారా మత్తులో తూగుతూ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామం నాటు సారా దెబ్బకు విలవిలలాడుతోంది. గతంలో నాటు సారా తాగి వందల మంది మృతి చెందినట్లు గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా సారా దుకాణాలు వెలసి రెక్కాడితేకాని డొక్కాడని జనం సారాకు అలవాటు పడి అదే మత్తులో తమ ప్రాణాలు కోల్పోతున్న సారాను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం జిల్లా కేంద్రానికే పరిమితమై నిర్లక్ష ధోరణితో వ్యవరించడంతో సారా అమ్మె వారిపై నియంత్రణ లేక గ్రామంలో ఇష్టారాజ్యంగా సారా విక్రయాలు జరుగుతున్నాయి. గ్రామంలో గల్లీకొక సారా దుకాణం వెలసి గ్రామంలో ఎంతో మంది దీనికి బలైపోతున్నారు.
శంకర్‌నాయక్…. కాకర్లపహాడ్ గ్రామ సర్పంచ్ భర్త
గతంలో ఎంతో మంది సారా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సారా వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రజా రోగ్యంతో ఆడుకుంటున్న సారా విక్రయదారులపై కఠినమైన చర్యలు తీసుకొని సారా విక్రయాన్ని పూర్తి ఆపేయాలి.
వెంకటయ్య….టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు….
సారా తయారీలో కలుపుతున్న నిశిద్ధ విష పదార్థాల వల్ల తాగిన ప్రతి ఒక్కరి ముఖాలు నల్లగా మారి అందవికారంగా మారుతున్నాయి. పేద ప్రజలు కూలీకి వెళ్లడం మానేసి మత్తులో గ్రామంలో ఎక్కడపడితే అక్కడే పడిపోయి కనిపిస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే మంచింది.
బాలయ్య…. కాకర్లపహాడ్ గ్రామస్థుడు
నాటు సారా తయారీపై ఇదివరకు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. ఈ నాటు సారా గ్రామస్థులు తాగి తమ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్షం వల్లే ఈ అనర్థాలు..సంజీవరెడ్డి
సారాను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నెలల తరబడి గ్రామానికి మళ్లీ చూడపకోవడం వారి నిర్లక్షానికి నిదర్శనం. సారా తయారీ, విక్రయదారులపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పట్టించుకోకపోతే ఎలా…?

Comments

comments

Related Stories: