నయన్ స్థానంలో కాజల్

మూడు సంవత్సరాల క్రితం తమిళ్‌లో జయం రవి ‘తని ఒరువన్’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు.  ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘తని ఒరువన్ 2’ రాబోతోంది. సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని తెలిసింది. ‘తని ఒరువన్’లో హీరోయిన్‌గా నయనతార నటించింది. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. స్టార్ హీరోల స్థాయిలో ఆమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు వసూళ్లను రాబడుతున్నాయి. దాంతో ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు 3 నుండి […]

మూడు సంవత్సరాల క్రితం తమిళ్‌లో జయం రవి ‘తని ఒరువన్’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు.  ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘తని ఒరువన్ 2’ రాబోతోంది. సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని తెలిసింది. ‘తని ఒరువన్’లో హీరోయిన్‌గా నయనతార నటించింది. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. స్టార్ హీరోల స్థాయిలో ఆమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు వసూళ్లను రాబడుతున్నాయి. దాంతో ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు 3 నుండి 5 కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే తని ఒరువన్ 2 చిత్రంలో నయనతారను తీసుకోవడానికి ఆమె భారీ పారితోషికంతో పాటు  స్టార్ రేంజ్ అడ్డంకిగా మారిందట. దీంతో ఆమె స్థానంలో కాజల్‌ను తీసుకోవాలని ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించుకున్నారట. తమిళనాట మంచి క్రేజ్ ఉన్న కాజల్ అయితే జయం రవికి జోడీగా సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట.

Comments

comments

Related Stories: