‘నన్ను దోచుకుందువటే’టీజ‌ర్ విడుద‌ల‌

Nannu Dochukunduvate Movie Teaser Released

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నన్ను దోచుకుందువ‌టే’. శనివారం ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆర్ ఎస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన న‌బా న‌టేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవ‌ల సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సుధీర్ త‌న నిర్మాణ సంస్థ‌లో తొలి చిత్రంగా నన్ను దోచుకుందువ‌టే సినిమా నిర్మిస్తున్నాడు. ఇక ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన ‘స‌మ్మోహ‌నం’ చిత్రంతో బంపర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న సుధీర్ ‘నన్ను దోచుకుందువ‌టే’తో మరో విజయాన్ని సాధించడం ఖాయమని చెబుతున్నాడు. తాజాగా విడుదలైన మూవీ టీజర్ కూడా చాలా ఫ్రెష్ అండ్ నీట్ గా ఉంది.