నడిరోడ్డుపై డబుల్ బెడ్ రూం దరఖాస్తు ఫారాలు

జ్యోతినగర్: రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పై లబ్దిదారులు పెట్టుకున్న ఆశలపై అధికారులు నీళ్ళు కుమ్మరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉండగా స్థానిక అధికారులు అంతులేని నిర్లక్షాన్ని ప్రదర్శించారు. రెండు పడక గదుల ఇండ్ల కోసం రామగుండం ప్రాంత ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులను చెత్తబుట్టలో పడేశారు. అవి కాస్తా ఎన్టిపిసి టౌన్‌షిప్‌లో నడి రోడ్డుపై దర్శనం ఇచ్చాయి.  వివరాలు ఇలావున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం […]

జ్యోతినగర్: రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం పై లబ్దిదారులు పెట్టుకున్న ఆశలపై అధికారులు నీళ్ళు కుమ్మరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉండగా స్థానిక అధికారులు అంతులేని నిర్లక్షాన్ని ప్రదర్శించారు. రెండు పడక గదుల ఇండ్ల కోసం రామగుండం ప్రాంత ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులను చెత్తబుట్టలో పడేశారు. అవి కాస్తా ఎన్టిపిసి టౌన్‌షిప్‌లో నడి రోడ్డుపై దర్శనం ఇచ్చాయి.  వివరాలు ఇలావున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్దిదారుల ఫారాలను నడిరోడ్డుపై పడవేసి వెళ్ళిన సంఘన ఎస్టిపిసి టౌన్‌షిప్‌లో వెలుగుచూసింది. శుక్రవారం నాడు టిటిఎస్‌కాలనీలోని ఈడిసికి వెళ్ళే రోడ్డు మార్గం పక్కనగల ఏ టైపులోని రోడ్డు వద్ద డబుల్ బెడ్ రూంల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు ఐదువందల దరఖాస్తు ఫారాలను నడిరోడ్డుపై పడవేసి వెళ్లడంతో స్థానిక కాలనీ వాసులకు కుప్పలు కుప్పలుగా రోడ్డుపై పడి ఉన్న దరఖాస్తు ఫారాలు అనిపించాయి. దరఖాస్తు ఫారాలు అన్ని రామగుండం మండలం లింగాపూర్‌తో పాటు పలు గ్రామాలకు చెందిన ఫారాలు కలిగి ఉండటం స్థానికులను ఆశ్చర్యం కలిగించాయి. పలువురు లబ్దిదారులు ఎంతో ఆశతో డబుల్ బెడ్ రూమ్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని అధికారులు నిర్లక్షంగా వదిలివేయడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు ఫారాలను కుప్పలు కుప్పలుగా పడి ఉండటంతో లబ్దిదారుల ఆశల మాటేమిటోగాని వారి దరఖాస్తులు వర్షానికి తడిసి పశువులకు ఆహారంగా మారిపోయాయి.

Comments

comments

Related Stories: