నట్టింట పూల కొలువు ఉరుళి

కేరళీయులకీ, కేరళని సందర్శించిన వారికీ ఉరుళి పరిచయమే. అక్కడ రిసార్టులూ, స్పాలూ, హోటళ్లూ, ఎక్కడైనా అందంగా అమర్చితే కొత్త అందాన్ని ఉరుళి ఇనుమడింప చేస్తూ ఉంటాయి. రంగురంగుల పూలూ, ఆకులూ, దీపాలతో అలంకరించిన ఉరుళి అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. దీనిని వార్పు, వట్టాళం అనీ కేరళలో పిలుస్తారు. ఉత్తర భారతంలో ఎక్కువగా అలరిస్తున్న ఉరుళి ఇప్పుడు తెలుగు లోగిళ్లలోనూ అందంగా కనువిందు చేస్తోంది. గృహానికి ముందు హాలు మధ్యలోగానీ, పూజగదిలో గానీ, దేవుడి ముందుగానీ నీళ్లు పోసి, […]

కేరళీయులకీ, కేరళని సందర్శించిన వారికీ ఉరుళి పరిచయమే. అక్కడ రిసార్టులూ, స్పాలూ, హోటళ్లూ, ఎక్కడైనా అందంగా అమర్చితే కొత్త అందాన్ని ఉరుళి ఇనుమడింప చేస్తూ ఉంటాయి. రంగురంగుల పూలూ, ఆకులూ, దీపాలతో అలంకరించిన ఉరుళి అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. దీనిని వార్పు, వట్టాళం అనీ కేరళలో పిలుస్తారు. ఉత్తర భారతంలో ఎక్కువగా అలరిస్తున్న ఉరుళి ఇప్పుడు తెలుగు లోగిళ్లలోనూ అందంగా కనువిందు చేస్తోంది. గృహానికి ముందు హాలు మధ్యలోగానీ, పూజగదిలో గానీ, దేవుడి ముందుగానీ నీళ్లు పోసి, పూలతో అలంకరించిన ఉరుళిని పెట్టడం వల్ల ఇంటికి మంచిదని కొందరి నమ్మకం. రకరకాలుగా పూలతో అమర్చటం వల్ల కళ్లకీ ఆహ్లాదకరమే.

పూల సువాసనలతో కలిసి మనసును ప్రశాంతంగానూ ఉంచుతుంది. అరోమాథెరపీలాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మల్లె, సంపెంగ, గులాబీ, బంతి, దేవగన్నేరు, నందివర్ధనం, గోవర్ధనం… వంటి సువాసనగల పూలను అందంగా కనిపించే మందార, బంతి, చామంతిలతో కలిపి ఉరుళిని అలంకరిస్తారు. ఉరుళిని కేవలం మట్టితోనే కాకుండా ఇత్తడి, కంచు, రాగి, వెండి, బంగారంతో కూడా తయారు చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం వెడల్పుగా సాదాగా ఉండే ఉరుళి, ఇప్పుడు వినాయకుడు, లక్ష్మీదేవి, రాధాకృష్ణులు, దశావతారాలు, వెంకటేశ్వరుడు, బుద్ధుడు, అష్టలక్ష్మి.. ఇలా దేవతామూర్తుల బొమ్మలతోనూ, డిజైన్స్‌తో అద్భుత కళాకృతిలో తయారవుతోంది.

మధ్యలో దేవతామూర్తుల విగ్రహంతో పాటు దీపాలు వెలిగించటానికి దీపపు ప్రమిదలను కూడా జోడిస్తున్నారు. ఇది ఒకప్పుడు కేరళీయుల సంప్రదాయ వంటపాత్ర. పెళ్లిళ్లూ పేరంటాలూ జరిగేటప్పుడు భారీయెత్తున వంటలు చేయడానికి, దేవాలయాల్లో ప్రసాద పాయసాలు తయారుచేయడానికి ఉపయోగించేవారు. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో వీటిలో నీళ్లు కాస్తుండటం మనం చూస్తూంటాం. కాలగతిలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై ఇళ్లలో భారీ వంటలు చేయడం తగ్గిపోయింది. అలనాటి వార్పు కాస్తా నేడు ఉరుళిగా,అద్భుత గృహాలంకరణ శోభితంగా మారిపోయింది.

Comments

comments