చెన్నై: సీనియర్ హాస్యనటుడు రామనాథన్ (74) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంగా ఉండటంతో రామనాథన్ ను ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబీకులు చేర్పించారు. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు. వరం, నామ్ మన్ సోరు, ఒరు పుల్లాంకుళల్ అడుప్పు ఉదుదు, స్పరిశం, వలత్తకడాలతో పలు సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులను కనువిందుచేశారు. రామనాథన్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ నటీనటులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.