నకిలీ సర్టిఫికెట్స్ ముఠా అరెస్టు

Fake Certificates Gang Arrested at Warangal

వరంగల్ : నకిలీ సర్టిఫికెట్స్‌ను తయారు చేస్తున్న ముఠాను శుక్రవారం వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు దేశంలోని పలు యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను ఏడుగురు సభ్యులు గల ఈ ముఠా తయారు చేస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు కలర్ ప్రింటర్స్, ట్యాబ్, ఐపాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Fake Certificates Gang Arrested at Warangal

Comments

comments