నకిలీ విత్తనాలపై కదలిన అధికార యంత్రాంగం

మనతెలంగాణ కథనానికి వ్యవసాయ శాఖ స్పందన తాండూర్‌లో రైతులను విచారించిన అధికారులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచన నకిలీ విత్తనాల వ్యాపారులపై విచారణ మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: నకిలీ విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు మొలకెత్తక పోవడంతో అన్యాయం జరిగిందని మానసిక ఆం దోళనలకు గురువుతున్న విషయాన్ని శుక్రవారం మన తెలంగాణ దిన పత్రికలో నకిలీ విత్తనాల మాయాజాలం శీర్షికన వెలుగులోకి తీసుకురాగా అధికార యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు […]

మనతెలంగాణ కథనానికి వ్యవసాయ శాఖ స్పందన
తాండూర్‌లో రైతులను విచారించిన అధికారులు
నకిలీ విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచన
నకిలీ విత్తనాల వ్యాపారులపై విచారణ

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: నకిలీ విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు మొలకెత్తక పోవడంతో అన్యాయం జరిగిందని మానసిక ఆం దోళనలకు గురువుతున్న విషయాన్ని శుక్రవారం మన తెలంగాణ దిన పత్రికలో నకిలీ విత్తనాల మాయాజాలం శీర్షికన వెలుగులోకి తీసుకురాగా అధికార యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి మొలకెత్తని పత్తి చేనులను సందర్శించారు. మంచిర్యాల వ్యవసాయశాఖ డివిజన్ వ్యవసాయాధికారి వీరయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ బాపు, టెక్నికల్ ఏఓ సుధాకర్, తాండూర్ ఏఓ కిరణ్మయిలు తాండూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల ఇండ్లకు వెళ్లి వారికి నకిలీ విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. పలుచోట్ల విత్తనాలు మొలకెత్తలేదన్న విషయాలు రైతులు తమ దృష్టికి  తీసుకురావడం లేదని అధికారులు  అన్నారు. నకిలీ విత్తనా లు అమ్మిన వ్యాపారులపై ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని,అయితే రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు.  రైతులు కొందరు తాము ఫిర్యాదు చేస్తే వ్యాపారులతో పాటు తమపై కూడా కేసులు పెట్టుతారని  భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లాలో కోట్లాది రూపాయల విలువచేస్తే నకిలీ విత్తనాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని వ్యాపారులను అరెస్టు చేశారు. అయితే రైతులు అధిక దిగుబడులు వస్తాయని  ఆశించి, నకిలీ విత్తనాలకు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేశారు. ప్రస్తుతం విత్తనాలు మొలకెత్తకున్నా  రైతులు వారి గోడును ఎవరికి  చెప్పుకోలేకుండా మానసికంగా కృంగిపోతున్నారు.  మరెన్నో వెలుగులోకి రాని విషయాలు ఉండగా రైతులు నాటిన  పత్తి గింజల వ్యవహారంపై వ్యవసాయశాఖ అధికారులు సమగ్రంగా విచారణ జరిపినట్లయితే  ఎంతో మంది రైతులు  నకిలీ విత్తనాల బారిన పడి  నష్టపోతున్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Comments

comments