నకిలీ నోట్ల తయారీ ముఠా పట్టివేత

DSP-Sudarsha-goud-image

మనతెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో నకిలీ నో ట్లను తయారు చేసి వాటిని వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం పొత్కపల్లి పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి వంద, రెండొందలు, ఐదొందలు,రెండు వేల రూపాయల డినామినేషన్ గల 6 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని,వాటినితయారు చేసేందుకు ఉపయోగించే కంప్యూటర్,ప్రింటర్, స్కానర్ స్వాధీనంచేసుకొన్నట్టు పెద్దపల్లి డిసిపి సుదర్శన్‌గౌడ్ తెలిపారు. పెద్దపల్లి ఎసిపి కార్యాలయం లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి మాట్లాడుతూ కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రానికిచెందిన చల్ల రాయమల్లు,గంగారంగ్రామానికి చెందిన కొలిపాక శ్రీనివాస్‌లు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన శేక్‌గుంషావలి వద్ద నకిలీ నోట్లు తెచ్చి గత రెండేళ్ల నుంచి చలామని చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో తామే స్వ యంగా తయారు చేయాలని కంప్యూటర్,ప్రింటర్,స్కానర్ లను కొనుగోలు చేసి కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో గత నాలుగు నెలల నుంచి తయారు చేస్తూ ప్రజలకు అంట గడతున్నారని డిసిపి తెలిపారు. చల్ల రాయమల్లు,కొలిపాక శ్రీనివాస్‌లు తాము తయారు చేసిన 6 లక్షల ఫేక్ కరెన్సీని ఓదెల మండలానికి చెందిన నల్లగోని కుమార్, తుమ్మ సదానందం,కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన కందుల ఉదయ్ కు మార్,దుగ్యాల అనిల్‌కు ఇచ్చేందుకు పొత్కపల్లికి చెందిన రెడ్డిబాపు ఇంట్లో సమావేశం అవుతుండగా పక్కా సమాచారంతో పొత్కపల్లి ఎస్‌ఐ ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏడుగురు నిందితులను పట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబందించి ఖమ్మంకు చెందిన షేక్‌గుంషావలి,జీల కుంటకు చెందిన ముంజాల శ్రీధర్,పుల్కుర్తి చెందిన దుగ్యాల అనిల్‌లు పరారిలో ఉన్నట్లు డిసిపి చెప్పారు.నిందితులపై ఐపిసి 489/ఎ,బి,సి,డి,ఇ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిసిపి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి ఎసిపి హబీబ్ ఖాన్,సుల్త్తానాబాద్ సిఐ రాములు,పాల్గొన్నారు.

Comments

comments