నందిపేటలో భారీ అగ్నిప్రమాదం

నందిపేట: నందిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంబవించడంతో ఆరు వ్యాపార దుకాణాలు దగ్ధం కాగా సుమారు 30 లక్షల వరకు ఆస్థినష్టం సంబవించింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బస్టాండ్ సమీపంలోని మెయిన్‌రోడ్డులో చిన్న సిలిండర్‌లు విక్రయించుకునే లింబాద్రి అనే వ్యాపారి మంగళవారం సాయంత్రం దుకుణంలోనే నిబంధనలకు విరుద్దంగా సిలిండర్‌ను నింపుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆయన బయటకు పరుగులు తీయడంతో దుకాణంలోని […]

నందిపేట: నందిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంబవించడంతో ఆరు వ్యాపార దుకాణాలు దగ్ధం కాగా సుమారు 30 లక్షల వరకు ఆస్థినష్టం సంబవించింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బస్టాండ్ సమీపంలోని మెయిన్‌రోడ్డులో చిన్న సిలిండర్‌లు విక్రయించుకునే లింబాద్రి అనే వ్యాపారి మంగళవారం సాయంత్రం దుకుణంలోనే నిబంధనలకు విరుద్దంగా సిలిండర్‌ను నింపుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆయన బయటకు పరుగులు తీయడంతో దుకాణంలోని సిలిండర్ పెద్ద శబ్దంతో పేలి పక్కనున్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. చుట్టు ప్రక్కల ఎక్కడా నీటి సౌకర్యం లేకపోవడం, అదే సమయంలో గాలి వీయడంతో మంటలు ఆరు దుకాణాలు చుట్టు ముట్టాయి. గంట సేపైనా నిజామాబాద్ నుండి గానీ, ఆర్మూర్ నుండి కానీ అగ్నిమాపక యంత్రం రాకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. స్థానికులు జేసిబి సహాయంతో మంటలు అంటుకున్న దుకాణాలను ఇతర దుకాణాలకు అంటుకొకుండా వాటిని తొలగించడంతో ఇంకా పక్క ఉన్న దుకాణలకు ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో సంఘటనకు కారకుడైన లింబాద్రి సిలిండర్ దుకాణంతో పాటు చెప్పుల దుకాణం, కిరాణ దుకాణం, పెస్టిసైడ్ దుకాణం, ఒక బట్టల దుకాణం మంటల్లో కాలి బూడిదయ్యాయి. పూల దుకాణం స్పల్పంగా కాలిపోయింది. ఇందులో బిల్ల నారాయణకు చెందిన కిరాణ దుకాణంలో సుమారు 10 లక్షల వరకు సరుకులు కాలిపోగా రాంబాబుకు చెందిన పెస్టిసైడ్ దుకాణంలో 10 లక్షల వరకు పురుగుల మందులు కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు. మిగతా బట్టల దుకాణం, సిలిండర్ దుకాణం, చెప్పుల దుకాణాల్లో సుమారు 10 లక్షల విలువ చేసే సరుకులు,వస్తువులు కాలిబూడిదయ్యాయి.

అగ్నిమాపక వాహనం ఆలస్యంగా రావడం: ప్రమాదం సాయంత్రం 5.15 నిమిషాల ప్రాంతంలో జరగగా అగ్నిమాపక సిబ్బంది ఆర్మూర్ నుండి 6.05 నిమిషాలకు వచ్చింది. సుమారు గంటపాటు ఆలస్యంగా రావడం, అదే సమయంలో గాలి వీచడంతో మంటలు పెద్దగా అయ్యి ప్రమాదం పెద్దదయ్యింది. ఒకవేళ అగ్నిమాపక వాహనం ముందుగానే వచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాక నిజామాబాద్ నుండి కూడా వాహనం వచ్చినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది.