నందిపేటలో అపహరణకు గురైన బాలిక ఆచూకీ లభ్యం..

నందిపేట:  మండల కేంద్రంలో  గీతా కాన్వెంట్‌ పాఠశాల నుంచి ఆరేళ్ళ పాప కిడ్నాప్‌కు గురైన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే . ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తాజాగా అపహరణకు గురైన బాలిక ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కేరళ పోలీసుల సహకారంతో బాలిక తిరువనంతపురంలో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం బాలిక మణీశ్వరి, ఆమెను అపహరించిన రజిత కేరళ పోలీసుల అదుపులో ఉన్నట్లు నందిపేట ఎస్ఐ సంతోష్ […]

నందిపేట:  మండల కేంద్రంలో  గీతా కాన్వెంట్‌ పాఠశాల నుంచి ఆరేళ్ళ పాప కిడ్నాప్‌కు గురైన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే . ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తాజాగా అపహరణకు గురైన బాలిక ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కేరళ పోలీసుల సహకారంతో బాలిక తిరువనంతపురంలో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం బాలిక మణీశ్వరి, ఆమెను అపహరించిన రజిత కేరళ పోలీసుల అదుపులో ఉన్నట్లు నందిపేట ఎస్ఐ సంతోష్ కుమార్ వెల్లడించారు.

Related Stories: