ధర్మారంలో విషాదఛాయలు…

The tragedy in Gowda family's deaths

ధర్మారం: ధర్మారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిన్న వయస్సులోనే ఒక యువకుడు, ఓ యువతి మృతి చెందడంతో గౌడ కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఒకే రోజు ఇరువురు ఒకే కులానికి చెందిన వారు పాడెనెక్కడంతో కుటుంబాలన్ని రోడ్డున పడ్డాయి. ధర్మారంలోని గౌడ కులానికి చెందిన పాలకుర్తి పల్లవి (28) తన 40 రోజుల చిన్నారిని లాలిస్తూ కుప్పకూలి ఆకస్మాత్తుగా మృతి చెందింది. పల్లవికి మూడు సంవత్సారాల మరో కూతురు ఉండగా భర్త వెంకటేశం కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. పల్లవి ఆకస్మిక మృతితో ఇరువురు చిన్నారులు అనాథలుగా మారిపోయారు. మరో సంఘటనలో గణేష్ నగర్‌కు చెందిన బూరగడ్డ శ్రీనివాస్ (40) ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతూ మృతి చెందగా మృతుడికి భార్య, ముగ్గురు కూతూళ్ళు ఉన్నారు. శ్రీనివాస్ పైనే ఆధారపడి భార్య ముగ్గురు కూతుళ్ళు జీవిస్తుండగా, అతి చిన్న వయస్సులో భార్యను కోల్పోయి వెంకటేశం, తెలిసి తెలయని వయస్సులో తల్లిని కోల్పోయి చిన్నారులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కర్ని కలిచి వేసింది. మృతి చెందిన శ్రీనివాస్, పల్లవిలు బీద కుటుంబాలకు చెందిన వారు అయినందున ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని జనసేన నాయకులు నాడెం శ్రీనివాస్ కోరారు.