ధర్మారంలో ఒకరి ఆత్మహత్య

One's suicide in the dharmaram
ధర్మారం : ధర్మారం మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన సోగాల మొండయ్య అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గత ఐదేళ్ళ క్రితం పక్షవాతం రావడంతో కాలు, చేయి పడిపోయి ఇంటి వద్దె ఉంటున్న మొండయ్యకు మెరుగైన వైద్యం అందని స్థితిలో మానసికంగా కృంగిపోయి సోమవారం ఎవ్వరి లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ నీలినాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

Comments

comments