ధర్మపురి సంజయ్ పై నిర్భయ కేసు…

Nirbhaya Case Against Dharmapuri Sanjay

నిజామాబాద్: ధర్మపురి సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్‌లో శాంకరి నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రగతి శీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, పిడిఎస్‌యు, ఇతర సంఘాల ప్రతినిధులు, తమ తల్లిదండ్రులతో 11 మంది విద్యార్థినులు సచివాలయంలో హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇవాళ  ఉదయం నిజామాబాద్‌ సిపి కి విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఐపిసి 342, 354, 354ఏ,  సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. సంజయ్ ను అరెస్ట్ చేయాడానికి ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా,ఇంట్లో లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

comments