ధర్మపురి సంజయ్‌కు బెయిల్ మంజూరు…

Court granted bail for Dharmapuri Sanjay
నిజామాబాద్: టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు డి. శ్రీనివాస్ (డిఎస్) కొడుకు సంజయ్ కు గురువారం బెయిల్ మంజూరైంది. జిల్లాలోని ఆయన సొంత కళాశాల ‘శాంకరి’కి చెందిన నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పోలీసులు ఇటీవల అతడిని అరెస్ట్ చేసి, 19 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచారు. సంజయ్ కు నిజామాబాద్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఉదయం 10 .30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు కావాలని, పోలీసు విచారణ అధికారి అనుమతి లేకుండా నిజామాబాద్ విడిచిపోరాదని కోర్టు వెల్లడించింది. విచారణకు సహకరించాలని బెయిలు ఉత్తర్వులో జడ్జి రమేశ్ కుమార్ ఆదేశించారు.

Comments

comments