ధరణిలో రైతుల వివరాల నమోదును వేగవంతం చేయండి

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ మన తెలంగాణ/ఉప్పునుంతల : ఉప్పునుంతల మండల తహసీల్దారు కార్యాలయంను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరు ఇ.శ్రీధర్ సోమవారం ఉదయం 11 గంటలకు ఆకస్మీకంగా సందర్శించారు. అనంతరం అయన రైతుబంధు పాసుబుక్కులలో ఉన్న తప్పులను వెంటనే సరిచేయాలని తహసీల్దారు సుదర్శన్‌రెడ్డికి అదేశించారు. ధరణి వైబ్‌సైటులో రైతులు భూముల వివరాలను వేగవంతంచేయాలని అన్నారు. కార్యాలయంలోని కంప్యూటర్ గదిలో కంప్యూటర్ ముందు కూర్చోని నమోదు పక్రియను తహసీల్దారును అడిగి తెలుసుకుంటూ సవరణ లు చెసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్త […]

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్

మన తెలంగాణ/ఉప్పునుంతల : ఉప్పునుంతల మండల తహసీల్దారు కార్యాలయంను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరు ఇ.శ్రీధర్ సోమవారం ఉదయం 11 గంటలకు ఆకస్మీకంగా సందర్శించారు. అనంతరం అయన రైతుబంధు పాసుబుక్కులలో ఉన్న తప్పులను వెంటనే సరిచేయాలని తహసీల్దారు సుదర్శన్‌రెడ్డికి అదేశించారు. ధరణి వైబ్‌సైటులో రైతులు భూముల వివరాలను వేగవంతంచేయాలని అన్నారు. కార్యాలయంలోని కంప్యూటర్ గదిలో కంప్యూటర్ ముందు కూర్చోని నమోదు పక్రియను తహసీల్దారును అడిగి తెలుసుకుంటూ సవరణ లు చెసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్త లు తప్పక పాటించి గడువులోగా పూర్తి చేయాలని తహసీల్దారును హెచ్చారించారు. అనంతరం అయన కార్యాలన్ని తరుగతులను పరిశీలించారు. ప్రభుత్వం తహసీల్దారు కార్యాలయల్లో ప్రజలు  రిజిస్ట్రేషను సేవలను త్వరగా పనులను పూర్తి చేయాలని అన్నారు. రిజిస్ట్రేషను సేవలకు కావల్సిన సామాగ్రి అందినదా అని అరా తీశారు. రెవెన్యూ సిబ్బంది అందరు ప్రజలకు అందుబాటులో ఉండి త్వరగా పనులు వేగవంతం చేయాలని అన్నారు. అనంతరం మండల విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో 2లక్షల 35 వేల పాసుపుస్తకాలను ముద్రించడం జరిగిందాన్నారు. వాటిలో 6000 మంది రైతులు పాసుపుస్తకాలు ఇంతవరకు తీసుకోలేదని అన్నారు. పాసు పుస్తకాల్లో తప్పులు ఉన్నాట్లయితే వెంటనే తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వంచే బీమా కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రవేశపెట్టనట్లు తెలిపారు. బీమాలో కేవలం పట్టాదారుకు మాత్రమే బీమా వర్తిస్తుందని తెలిపారు. కౌలురైతులకు బీమా వర్తింపబడదని ఖచ్చితంగా తెలిపా రు. బీమా ఎంత మొత్తం ఇస్తారో పూర్తి వివరాలను త్వరలోనే ప్రభుత్వం నుండి జారి అవుతాయని అన్నారు. ప్రజలు, రైతులు రెవెన్యూ సిబ్బందికి సహకరించి పనులను వేగవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట రాజస్వధికారి అమరేంధర్, సిబ్బంది రమేష్, రెవెన్యూ అధికారులు భాస్కర్, మండల వ్యవసాయధికారి రమేష్, కంప్యూటర్ అపరేటర్లు శంకర్, మునీర్ ఉన్నారు.

Comments

comments

Related Stories: