ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్…విఆర్ఎ మృతి

చిగురుమామిడి: మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న కెనాల్ పనుల్లో భాగంగా సంబంధిత కాంట్రాక్టర్ వినియోగిస్తున్న టిప్పర్ ఢీ కోన్నడంతో విఆర్‌ఎ మోహన్‌ను  మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివారాల ప్రకారం… ఇందుర్తి గ్రామానికి చెందిన కూన మోహన్(40) అనే విఆర్‌ఏ ఇందుర్తి నుండి నవాబుపేటకు వెళ్లె దారి నుండి టివిఎస్ ద్విచక్రవాహానంపై వస్తుండగా కెనాల్ వద్ద ఉన్న టిప్పర్ ఢీ కోట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు పలై రక్తపు మడుగులో కొట్టుమిట్టు […]


చిగురుమామిడి: మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న కెనాల్ పనుల్లో భాగంగా సంబంధిత కాంట్రాక్టర్ వినియోగిస్తున్న టిప్పర్ ఢీ కోన్నడంతో విఆర్‌ఎ మోహన్‌ను  మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివారాల ప్రకారం… ఇందుర్తి గ్రామానికి చెందిన కూన మోహన్(40) అనే విఆర్‌ఏ ఇందుర్తి నుండి నవాబుపేటకు వెళ్లె దారి నుండి టివిఎస్ ద్విచక్రవాహానంపై వస్తుండగా కెనాల్ వద్ద ఉన్న టిప్పర్ ఢీ కోట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు పలై రక్తపు మడుగులో కొట్టుమిట్టు అవుతున్న మోహన్ ను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుడగా దారి మధ్యలోనే మృతి చెందినట్టు గ్రామస్థులు తెలిపారు. సంఘటన స్థలానికి చిగురుమామిడి తహాశీల్ధార్ గడ్డం సుధాకర్ చేరుకొని భాధిత కుటుంబాన్ని ఒదార్చారు. ప్రమాదానికి గల కారణాలను గ్రాపస్థులను అడిగి తెలుసుకున్నారు. ఇట్టి సంఘటనపై రాత్రి వరకు భాధితులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఎఎస్ఐ సత్తు వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి భార్య భాగ్య, ముగ్గరు కుతుళ్లు రాణి, జ్యోతి, అనుషలు ఉన్నారు. మృతుడి చిన్న కూతురు అనూష మానసిక వికలాంగురాలు కావటం, ముగ్గురు కూతుళ్లు ఉండటంతో కుటుంబ సభ్యుల రోధనలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల అదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Comments

comments

Related Stories: