దోబూచులాట

 farmer looking towards the sky

రానా వద్దా అంటూ ఊరిస్తున్న వరుణుడు
వర్షం కురువక ముందుకు సాగని ఏరువాక
ఆశగా ఆకాశం వైపు చూస్తున్న కర్షకులు
జిల్లాలో ప్రశ్నార్థకంగా మారిన ఖరీఫ్ సాగు

అన్నదాత ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అదుసులో వరుణుడు క రుణించకపోవడంతో అన్నదాత ల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు మాసాలు గడుస్తున్నా ఆశించిన స్థా యిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి అందిన పెట్టుబడి సాయంతో రెట్టింపు ఉత్సాహంతో సేద్యానికి శ్రీకారం చుట్టిన అన్నదాతల ఆశలపై  కరు వు మేఘం నీళ్లు చల్లిందనేచెప్పాలి. కార్తెలు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నా వరుణుడు కరుణించకపోవడంతో ఏం చేయాలో పాలుపోక రైతులు ఆకాశం దిక్కు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశలు పెట్టుకున్న నైరుతి రుతుపవనాలు ఏ మాత్రం కనికరించకపోవడం,సరైన సమయంలో వాన చినుకు పడకపోవడం వెరసి ఏరవాక ముం దుకు సాగలేకపోతోంది.అంతోఇంతో ఆపద సమయంలో మేమున్నామంటూ వచ్చే అల్పపీడనాలు కూడా ఈ దఫా అదుకునే పరిస్థితి లేకపోవడం రైతుల పాలిట ఆశనిపాతంలా మారింది.

మన తెలంగాణ/నల్లగొండ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారంలో తొలకర్లు మురిపించడంతో అన్నదాతలు ఖరీఫ్‌పై కోటి ఆశలు పెంచుకున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ముందస్తుగా జిల్లాకు తాకడంతో ఆనందపడి ఉబ్బితబ్బిబయ్యారు. ఈ నేపధ్యంలో నైరుతి ప్రవేశించిన వారం రోజుల్లోపే వాన చినుకు కరువై మటుమాయమైంది. ఈ క్రమంలో జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 80.2 మిమీగాను 128.0 మి.మీ నమోదైంది. దీంతో జూలై మా సంలో ఇక భారీ వర్షాలకు కొదవలేదని గంపెడు ఆశలు పెట్టుకుంటే కరువు మేఘం కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. మృగశిర, అరుద్ర, పునర్వసు వచ్చినా కూడా పరిస్థితిలో మార్పులేదు. జూలైలో అంతంత మాత్రమే వర్షం కురిసింది.

వర్షాన్ని నమ్ముకొని రెండు దఫాలు విత్తనాలు..
దినదినగండంగా ప్రతిరోజు ఏదో ఓ సమయాన ఆకాశంలో కమ్ముకు న్న నీలిమబ్బులను చూపి వర్షాలు కురుస్తాయని నమ్ముకొని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో వారి ఆశలపై నీళ్లు చల్లేలా వరుణుడి పత్తా లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అడపాదడపా ప డుతున్న వర్షాలను నమ్ముకొని జిల్లాలో రైతులు రెండు ద ఫాలు సాగుకు సమాయత్తమయ్యారు. జూన్ మొదటి వా రంలో వేసిన విత్తనాలు మొలకలు రాగా ఆపై వరుణ దేవుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందడం వారి వంతైంది. ఈ క్రమంలో మరోసారి జూన్ చివరలో పడిన ఓ మోస్తరు వ ర్షాన్ని నమ్ముకుని తిరిగి విత్తనా లు నాటారు. మొలకలు మొ లి చిన తర్వాత వర్షాలు కురియలేదు. మొక్కలు వాడిపో యే దశ లో జూలైలో వారంరోజుల పాటు ముసురు వర్షాలు కురిశాయి. దీంతో మొ క్కలకు జీవం పోసినట్లయ్యిం ది. మళ్లీ వరుణుడు ముఖం చాటేయడంతో రైతన్నల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది. భారీ వర్షాలు లేక వాగులు పొంగలే దు చెరువులు నిండలేదు. ఈ క్రమంలో ఇప్పడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న పంటలు..వరుసగా 4 రోజులు ఎండలు దంచి కొడుతున్నాయని, మరో కొన్ని రోజులు కనుక ఇలానే వాతావరణం సహకరించకపోతే వాడిపోయే స్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో సాగు విస్తీర్ణం అంతంతమాత్రమే :
జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణం 3లక్షల14వేల 398 హెక్టార్లుగా అధికారులు అంచనా రూపొందించారు. ఇందులో ఇప్పటి వరకు 2లక్షల47వేల 500 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. అయితే అంచనాకు కొంత దగ్గరగా సాగు విస్తీర్ణం ఉన్నప్పటికీ చాలా పంటలు వా డుపడ్డాయి. వర్షాభావ పరిస్థితులతో మొక్కజొ న్న, పత్తి తదితర పంటల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక వరి సాగుకు వచ్చే సరికి 63వేల పైచిలుకు హెక్టార్లలో సాగులక్షం కాగా ఇప్ప టి వరకు కేవలం 20వేల హెక్టార్లు కాగా కాస్తా అటు ఇటు గా రై తులు సాగు చేయడంతో వరి సాగుపై వర్షం ప్రభావం సు స్పష్టంగా కనబడుతోంది. కొందరు రైతులు ఇప్పటికే రెండోసారి పత్తి విత్తనాలు వేసి అప్పుల పాలయ్యారు. ఈ సమయంలో కూడా వర్షాలు పడకపోతే రెండు సార్లు పెట్టుబడిని వారు నష్టపోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదనేది తెలిసిందే. జూ న్‌లో సాధారణ వర్షపాతం 80.2. మి.మీ.కు 128.0 మి. మీ.గా నమోదైంది. దీంతో మరో వారం.. పది రోజుల్లోపు వర్షాలు బాగా సరిపడా కురియకపోతే వరి సాగు 50 శాతం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వరి నారు పోసుకున్న వారంతా బోరుబావుల ఉన్న రైతులే. కానీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు భారీ వ ర్షాల ఊసే లేదు. వచ్చే వారంపది రోజుల్లో వర్షాలు లేకపోతే మాత్రం పంటల సాగుకు ఇబ్బం దే. ఇదిలా ఉండగా ఆగ స్టు మాసం వరకు వరి నాట్లు వేసుకోవచ్చు కాని ఆలోపు వర్షం కురిస్తే వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుంది.