దేశంలోనే తొలి ఎల్ఇడి మూవీ థియేటర్…

India gets its first LED cinema screen at Delhi PVR

న్యూఢిల్లీ: దేశంలోనే మొట్ట మొదటి ఎల్ఇడి థియేటర్ ఢిల్లీలో ప్రారంభమైంది. మొన్నటి వరకూ మొబైల్, టివిలకే పరిమితమైన ఎల్ఇడి టెక్నాలజీ ఇప్పుడు సినిమా తెరలకు వచ్చేసింది. దీంతో సినిమా థియేటర్లలో మరింత స్పష్టమైన, ప్రకాశవంతమైన చిత్రాన్నిచూసే వీలు కలుగనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ లోని పివిఆర్‌ మల్టీప్లెక్స్‌ లో తొలి ఎల్ఇడి స్క్రీన్ ను ప్రారంభించారు. కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు శాంసంగ్‌ సంస్థ సహకారంతో ఈ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీతో మరింత స్పష్టమైన చిత్రంతో పాటు సౌండ్ సిస్టమ్ కూడా మరింత అద్భుతంగా ఉంటుందని పివిఆర్‌ మల్టీప్లెక్స్‌ నిర్వాహకులు చెప్పారు. కాగా, ఎల్ఇడి థియేటర్ లో వెలుతురులో కూడా మూవీ చూసేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదట. అదే సాధారణ సినిమా థియేటర్లలో అయితే లైట్లు ఉంటే బొమ్మ సరిగ్గా కనిపించదు. ఈ స్క్రీన్ ఏర్పాటుకు సుమారు రూ. 7 కోట్లు ఖర్చైందని శాంసంగ్ వెల్లడించింది. ప్రపంచం వ్యాప్తంగా ఇప్పటివరకూ కేవలం 12 థియేటర్లలో మాత్రమే ఈ తరహా ఎల్ఇడి స్క్రీన్ లను ఏర్పాటు చేశామని శాంసంగ్ ప్రతినిధులు తెలిపారు.

Comments

comments