దేవుడు చెప్పాడంటూ యువతితో పూజారి…!

కరీంనగర్: దేవుడి పేరుతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పూజారి‌కి గ్రామస్థులు దేహశుద్ధి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మానేరు బైపాస్‌ రోడ్డులో ఉన్న ఓ దేవాలయంలో దాదాపు పదేళ్ల నుంచి వెంకటరెడ్డి (55) పూజారిగా ఉన్నాడు. ఆయన గత సోమవారం గుడికి వచ్చిన యువతి (25)‌తో ‘కలలో దేవుడు కనిపించి నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు’ అంటూ పెళ్లి చేసుకుందామని బలవంతం చేయబోయాడు. దీంతో కంగారుపడిపోయిన యువతి ఇంటికి వెళ్లి జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో […]

కరీంనగర్: దేవుడి పేరుతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పూజారి‌కి గ్రామస్థులు దేహశుద్ధి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మానేరు బైపాస్‌ రోడ్డులో ఉన్న ఓ దేవాలయంలో దాదాపు పదేళ్ల నుంచి వెంకటరెడ్డి (55) పూజారిగా ఉన్నాడు. ఆయన గత సోమవారం గుడికి వచ్చిన యువతి (25)‌తో ‘కలలో దేవుడు కనిపించి నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు’ అంటూ పెళ్లి చేసుకుందామని బలవంతం చేయబోయాడు. దీంతో కంగారుపడిపోయిన యువతి ఇంటికి వెళ్లి జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో వారు గ్రాముస్థులతో కలిసి గుడికి వెళ్లారు. గుడికి వెళ్లి పూజారిని ప్రశ్నించగా, ‘అవును.. నాకు దేవుడు కలలో కనిపించి ఆమెని పెళ్లి చేసుకోమన్నాడు’ అని చెప్పాడు. దీంతో.. కోపద్రిక్తులైన బంధువులు అతడ్ని చితకబాదారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.