దూకుడుకు భారీ బ్రేక్

333 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ముంబయి: కొద్ది వారాలుగా దూసుకెళ్తున్న బుల్ దూకుడుకు సోమవారం భారీ బ్రేక్ పడింది. ఆగస్టులో తయారీ రంగం మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌కు ఇది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు, అమ్మకాల ఒత్తిడి వెరసి సెన్సెక్స్ 333 పాయింట్ల నష్టపోయి 38312.52 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 11600 మార్కును కోల్పోయింది. 98 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11,582 వద్ద […]

333 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబయి: కొద్ది వారాలుగా దూసుకెళ్తున్న బుల్ దూకుడుకు సోమవారం భారీ బ్రేక్ పడింది. ఆగస్టులో తయారీ రంగం మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌కు ఇది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు, అమ్మకాల ఒత్తిడి వెరసి సెన్సెక్స్ 333 పాయింట్ల నష్టపోయి 38312.52 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 11600 మార్కును కోల్పోయింది. 98 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11,582 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 185 పాయింట్ల స్థాయిలో కదలాడింది. ఎన్‌ఎస్‌ఇలో మెటల్, మీడియా సూచీలు తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా ఎంఎఫ్‌సిజి సూచీ 2.70 శాతం నష్టపోయింది. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 27,819.50 వద్ద ముగిసింది.

జిడిపి వృద్ధి గణాంకాలు ఇచ్చిన జోష్‌తో ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్ 271 పాయింట్ల లాభంతో 38,916 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 11,751 వద్ద ట్రేడ్ అవుతూ కనిపించాయి. డాలర్ మారకంలో రూపాయి రికవరీ కూడా సూచీలకు ఉత్సాహాన్నిచ్చాయి. ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలస్వీకరణకు దిగారు. మిడ్ సెషన్ అనంతరం యూరప్ మార్కెట్ మిశ్రమ ట్రేడ్, ఆగస్ట్‌లో తయారీ రంగం సూచీ మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సూచీలు నష్టాల బాట పట్టాయి. ప్రధానంగా ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, హిందుస్థాన్ యునిలివర్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 2.50 శాతం నుంచి 5శాతం నష్టపోయాయి. హెచ్‌పిసిఎల్, టైటాన్, ఐషర్‌మోటర్స్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభపడ్డాయి.

మిడ్‌క్యాప్ ఇండెక్స్
మిడ్‌సెషన్ సమయానికి ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నా, బిఎస్‌ఇ మిడ్ క్యాప్, స్మాల్మ్ క్యాప్ షేర్లు మాత్రం ర్యాలీ బాటలో కనిపించాయి. ఇంట్రాడేలో ఒకశాతం(0.89శాతం)ర్యాలీ చేసి 17,017.26 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత నష్టపోయింది. ఇక బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 17,243.10 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రా డేలో 0.90శాతం ర్యాలీ చేసి 17334.16 ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. ఇది కూడా నష్టాలతో ముగిసింది. వచ్చే రోజుల్లో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని, కొనుగోళ్లు చేపట్టే విషయంలో సలహాదారులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.

మరింతగా రూపాయి పతనం
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింతగా 71.10 కు పడిపోయిది. పెరుగుతున్న ముడిచమురు ధరలు రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఓ దశలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 70.76 వద్ద ట్రేడయింది. గత వారం మధ్య నుంచీ పతనబాట పట్టిన రూపాయి వారాంతానికి 71 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. తద్వారా కరెన్సీ చరిత్రలో తొలిసారి రూపాయి 71 వద్ద సరికొత్త కనిష్టాన్ని తాకింది. వర్ధమాన దేశాల కరెన్సీలు పతన బాట పట్టడం కూడా సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నా రు. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో డాలరు బలపడుతుంటే, ఆసియా కరెన్సీలు బలహీనపడుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. దేశీయంగానూ జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అమెరికా కరెన్సీ డాలరుతో మారకంలో ఈ ఏడాది(2018) వర్ధమాన దేశాల కరెన్సీలు పతన బాటలోనే సాగుతున్నాయి.

Comments

comments

Related Stories: