దారి దోపిడి దొంగలను అరెస్టు చేసిన పోలిసులు

దారిదోపిడి దొంగలను చాకచక్యంగా పట్టుకున్న నిర్మల్ పోలీసులు మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్‌ః నిర్మల్ జిల్లాలోని స్థానిక ఎస్పి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి శశిధర్‌రాజు మాట్లాడుతూ దారిదోపిడి దొంగలను నిర్మల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామానికి చెందిన గోవింద్(35) తన సొంత పని నిమిత్తం నిజామాబాద్‌కు వెళ్లి రాత్రి సుమారు 12గంటల ప్రాంతంలో నిర్మల్‌కు చేరుకోగా అక్కడ నుండి ఆడెల్లి గ్రామానికి వెళ్లాడానికి ఆటోను అద్దెకు మాట్లాడుకొని […]

దారిదోపిడి దొంగలను చాకచక్యంగా పట్టుకున్న నిర్మల్ పోలీసులు

మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్‌ః నిర్మల్ జిల్లాలోని స్థానిక ఎస్పి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి శశిధర్‌రాజు మాట్లాడుతూ దారిదోపిడి దొంగలను నిర్మల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి గ్రామానికి చెందిన గోవింద్(35) తన సొంత పని నిమిత్తం నిజామాబాద్‌కు వెళ్లి రాత్రి సుమారు 12గంటల ప్రాంతంలో నిర్మల్‌కు చేరుకోగా అక్కడ నుండి ఆడెల్లి గ్రామానికి వెళ్లాడానికి ఆటోను అద్దెకు మాట్లాడుకొని బయల్దేరన్నారు. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ మరో ఇద్దరిని ఆటోలో కూర్చోబెట్టుకొని కొద్ది దూరం వెళ్లి ఆటోను అపమన్నారు. అంతలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు గోవింద్‌పై దాడి చేసి, గాయపరిచి అతడి నుండి రూ.30వేలు లాక్కొని పరారైయ్యారన్నారు.ఇక చేసేదేమి లేక గోవింద్ లబోదిబోమంటూ నడుచుకుంటూ వెల్లాడన్నారు. ఇంతలో ప్రెటోలింగ్ చేస్తున్న వాహనం ఏర్పాడడంతో సారంగాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరకొని ఫిర్యాదు చేసిన అనంతరం నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారన్నారు.
కొండాపూర్ రహదారి పై సినీఫక్కిలో చోరీ
ఇలాంటి సంఘటనే సినీఫక్కిలో నిర్మల్ మండలంలో కొండాపూర్ రహదారి పై జరిగింది. భైక్‌పై వెళ్తున్న కోరిపెల్లి లింగారెడ్డి ఆదర్శనగర్ నివాసి రిటైడ్ ఎమ్మార్వోను ఆపి అతడి దగ్గర ఉన్న నగదు, బంగారు గొలుసు, రెండు ఉంగరాలు లాక్కున్నారు. బుధవారం ఉదయం గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటలకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ కేసుల విచారణలో భాగంగా నేరం జరిగిన క్రమాన్ని పరిశీలించగా ఆటో డ్రైవర్ ఒక బంక్‌లో డిజిల్ పోయించుకున్నట్లు తెలిసిందన్నారు. బంక్ సిసి టివిను పరిశీలించగా నేరం చేసిన వారు దుర్గారపు మహేష్, గండ్రత్ అనిల్‌గా గుర్తించడం జరిగింది. వీరితో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. జెల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యపూర్వకంగా నేరాలు చేసినట్లు అంగికారించారు. ఇటువంటి వారిని కట్టినంగా శిక్షించకపోతే  మరిన్ని నేరాలు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. సిసి టివి ఆధారంతో అత్యంత తక్కువ సమయంలో కేసులను చేదించారని దొంగలించిన సొత్తు రికవర్ చేసిన పోలీసులను ఎస్పి శశిధర్‌రాజు అభినందించారు. చేదించి పట్టుకున్న పోలీసుల బృందంలో డిఎస్పీ మనోహార్‌రెడ్డి, నిర్మల్ రూరల్ సీఐ జీవన్‌రెడ్డి, సారంగాపూర్ ఎస్‌ఐ సునిల్‌కుమార్, నిర్మల్ రూరల్ ఎస్‌ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ బోజాగౌడ్, ఫైయాజ్‌ఉల్ల, కానిస్టేబుల్స్ వర్మ, దేవురావు, నరేష్, కేశవ్‌గౌడ్, సందీప్ తదితరులు ఉన్నారు.