దసరాకల్లా కాళేశ్వరం

ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని పంపే  కార్యక్రమం విజయదశమికి సిద్ధం  హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరుకు పంపే కార్యక్రమం దసరా పండుగకల్లా సిద్ధం కానుంది. జలకళతో ఉన్న ఎల్లంపల్లి నుంచి నీటిని నేరుగా 6వ ప్యాకేజీలోని పంపుల ద్వారా ఎత్తిపోసి నందిమేడారం రిజర్వాయర్‌కు చేరుస్తారు. అనంతరం ఏడవ ప్యాకేజీలోని టన్నెల్ గుండా లక్ష్మీపూర్‌లోని 8వ ప్యాకేజీ పంపుహౌస్‌కు చేరి అక్కడి నుంచి ఎత్తిపోస్తే వరద కాలువ ద్వారా నేరుగా మిడ్‌మానేరుకు నీరు […]

ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని పంపే  కార్యక్రమం విజయదశమికి సిద్ధం 

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరుకు పంపే కార్యక్రమం దసరా పండుగకల్లా సిద్ధం కానుంది. జలకళతో ఉన్న ఎల్లంపల్లి నుంచి నీటిని నేరుగా 6వ ప్యాకేజీలోని పంపుల ద్వారా ఎత్తిపోసి నందిమేడారం రిజర్వాయర్‌కు చేరుస్తారు. అనంతరం ఏడవ ప్యాకేజీలోని టన్నెల్ గుండా లక్ష్మీపూర్‌లోని 8వ ప్యాకేజీ పంపుహౌస్‌కు చేరి అక్కడి నుంచి ఎత్తిపోస్తే వరద కాలువ ద్వారా నేరుగా మిడ్‌మానేరుకు నీరు వెళుతుం ది. ఇందులో ఇప్పటికే ప్యాకేజీ 6లో రెండు పంపులు డ్రైరన్ పూర్తి చేసుకొని నీటి ఎత్తిపోతలకు సిద్ధంగా ఉన్నాయి. ప్యాకే జీ 8లో కూడా రెండు పంపులు డ్రైరన్ పూర్తిచేసుకోగా, మూడో పంపు డ్రైరన్ శనివారం విజయవంతంగా పూర్తయ్యింది. మధ్యలో ప్యాకేజి 7లోని భూగర్భ సొరంగ మార్గం తవ్వే పనులు కొంత ఆలస్యంగా నడుస్తున్నందున ఇప్పటికే ఈ సొరంగంలోని మరొక పైప్‌లైన్ ద్వారా తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. తేలికపాటి మట్టిపొరలు తవ్వేకొద్దీ కూలుతుండడంతో సమస్యాత్మకంగా మారిన పైప్‌లైన్‌ను సరిచేస్తూ ఇంజనీర్లు ఛేదిస్తున్నారు. మరో నెల రోజుల్లో లైనింగ్ పనులు పూర్తవుతాయని ఇంజనీర్లు విశ్వాసం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా ప్యాకేజి 7లో 11.24 కిలోమీటర్ల మేర రెండు సమాంతర టన్నెళ్లు ఉన్నాయి. దసరా నాటికి రెండు టన్నెళ్లు పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో తొలుత కుడి ప్రధాన టన్నెల్ నుంచి మాత్రమే నీటిని పంపిస్తారని తెలిసింది. ప్యాకేజి 7లోని తొలి 7.9 కిలోమీటర్ల వరకు రెండు టన్నెళ్ల ద్వారా నీటిని పంపిస్తారు. ఆ తర్వాత ఎడమ టన్నెల్ లోని నీటిని కూడా కుడి టన్నెల్‌లోని మళ్లించి, లక్ష్మీపూర్‌లోని ప్యాకేజి 8 పంపుహౌజ్ వరకు తీసుకొస్తారు. డిసెంబరు నాటికి ఎడమ టన్నెల్ పనులన్నీ పూర్తవుతాయి. కానీ అంతకు ముందే నీటిని ఎత్తిపోయాలన్న తలంపుతో ఒక టన్నెల్‌నే ప్రస్తుతానికి వాడదామని నిర్ణయించారు. ఫలితంగా తొలుత అత్యవసర పనులన్నీ పూర్తిచేసి, దసరా నాటికి నీటి ఎత్తిపోతలకు ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.
సర్జ్‌పూల్‌కు లీకేజ్ ప్రూఫ్‌పెయింటింగ్…
ప్యాకేజి 6లోని సర్జ్‌పూల్‌కు లీకేజ్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి ఒక ప్రాజెక్టులో లీకేజ్ ప్రూఫ్ పెయింటింగ్ వేయడం ఇదే తొలిసారని ఇంజనీర్లు అన్నారు. ఈ పెయింటింగ్ వేయడానికి దుబాయి నుంచి కొంత మంది ప్రతినిధులు ఇటీవలే వచ్చి, సర్జ్‌పూల్‌ను సందర్శించినట్లు తెలిసింది. సుమారుగా 3 మిల్లీమీటర్ల మేర లీకేజ్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తారు. దీంతో సర్జ్‌పూల్‌లోకి చేరిన నీరు లీక్ కాకుండ ఉంటుంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావడంతో సాంకేతికంగా ఇబ్బందులు రాకుం డా ముందు జాగ్రత్త చర్యగా ఈ పెయింటింగ్ వేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్యాకేజిలో రెండు పంపులు డ్రైరన్ విజయవంతంగా పూర్తిచేసుకోవడంతో త్వరలోనే వెట్న్ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వెట్ రన్ చేయాలంటే, టన్నెల్ ద్వారా నీటిని పంపు వరకు పంపించాలి. ఒక్కసారి నీటిని పంపించాక ఇతర పనులు చేసుకోవడానికి కుదరదు. దీంతో చేయాల్సిన పనులన్నీ విభజించుకొని ప్రాధాన్యతల వారీగా వేగంగా పూర్తిచేస్తున్నారు. ప్రస్తుతం ప్యాకేజి 6లోని సర్జ్‌పూల్‌లో గేట్ల బిగింపు ప్రక్రియ నడుస్తుంది. ఎల్లంపల్లి వద్ద హెడ్ రెగ్యులేటర్ గేట్ల నిర్మాణం మరో వారం రోజుల్లో పూర్తికానుంది. వరుసగా వర్షాలు పడడంతో పనులకు ఆటంకంగా మారినప్పటికీ, అక్టోబరు 19వ తేదీ, విజయదశమి టార్గెట్‌గా ఏజెన్సీలపై ఇరిగేషన్‌శాఖ ఒత్తిడి పెంచుతోంది.
త్వరలో కన్నెపల్లి పంపుల డ్రై రన్…?
కాళేశ్వరం ప్రాజెక్టులో బాగంగా నీటిని కన్నెపల్లి నుంచి తొలుత ఎత్తిపోయాల్సి ఉంది. ఇందుకోసం రెండు పంపులు డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇదేవిధంగా అన్నారంలో ఒక పంపు, సుందిళ్లలో ఒక పంపు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని విద్యుత్‌కు సంబంధించిన పనులు చివరిదశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే పంపులను డ్రైరన్ చేస్తారు. డ్రైరన్ విజయవంతం అయ్యాక, సాంకేతిక జాగ్రత్తలు తీసుకొని, వెట్న్ చేస్తారు. అయితే ఎల్లంపల్లిలో నీళ్లు ఉండడంతో కన్నెపల్లి పంపులపై ఆధారపడే పరిస్థితి తప్పింది

Comments

comments

Related Stories: