దళారులదే రాజ్యం

ప్రభుత్వ భూములు.. దళారుల పాలు మఖ్తల్ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాల పర్వం రాయచూర్ వారికి మన ప్రభుత్వ భూములు కట్టబెట్టారు అధికారుల అవినీతి భోజ్యం స్వాధీనం చేసుకుంటే పేదలకు పంచే అవకాశం మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : జిల్లాలో మఖ్తల్ తహసీల్దార్ అవినీతికి కేరాఫ్‌గా మారింది. ఇక్కడ కాసులిస్తే నందిని పందిని, పందిని నందిని చేసే సమర్థ అధికారులు ఉన్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలను గుర్తించి, వారికి ప్రభుత్వ భూములు పంపిణీ చేసి […]

ప్రభుత్వ భూములు.. దళారుల పాలు
మఖ్తల్ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాల పర్వం
రాయచూర్ వారికి మన ప్రభుత్వ భూములు కట్టబెట్టారు
అధికారుల అవినీతి భోజ్యం
స్వాధీనం చేసుకుంటే పేదలకు పంచే అవకాశం

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : జిల్లాలో మఖ్తల్ తహసీల్దార్ అవినీతికి కేరాఫ్‌గా మారింది. ఇక్కడ కాసులిస్తే నందిని పందిని, పందిని నందిని చేసే సమర్థ అధికారులు ఉన్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలను గుర్తించి, వారికి ప్రభుత్వ భూములు పంపిణీ చేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కృషి చేస్తండగా కొంతమంది రెవెన్యూ అధికారుల అవినీతి, అక్రమాల వలన ప్రభుత్వ లక్షం నీరుగారే ప్రమాదం ఏర్పడుతోంది. సరిగ్గా మఖ్తల్ రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులే దళారులను నియమించుకొని అందిన కాడికి దండుకుంటున్నారు. ఫలితంగా వందలాది ప్రభుత్వ భూములు పరుల పాలు అవుతున్నాయి. పెద్ద అధికారే తప్పడు అడుగులు వేస్తే, మేమేమి తక్కవ అన్నట్లు కింది స్థాయి సిబ్బంది కూడా పైసలు లేనిదే పనలు చేయడం లేదు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు దోచుకుంటూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. గతంలోని ఒక తహసీల్దార్ డబ్బులకు కక్కుర్తి పడి వందలాది ప్రభుత్వ భూములను అప్పనంగా ఇతరుల పేరటి డి.పట్టాలు ఇచ్చేశారు. ఆ విషయం కాస్త బయట పడడంతో ఆ అధికారిని అక్కడి తప్పించి కలెక్టర్ కార్యాలయంకు సరెండర్ చేశారు. కాని విచారణ నత్తనడక సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి సరెండర్ అయిన తహసీల్దార్ అక్కడ  పని చేసిన కాలంలో ఎకరాకు ఇంత చొప్పున మద్య దళారుల నుంచి తీసుకుంటూ వందల ఎకరాలను ఇచ్చివేసినట్లు సమాచారం. అది కూడా డి.పట్టాలను ఇచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయ డం వంటివి చేయడంతో, తిరిగి వాటిని ఇతరులకు విక్రయించుకనే వీలు కల్పించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూ ములు తీసుకున్న వారు యధేచ్చగా కర్నాటక రాష్ట్రం రాయచూర్, ఇతర జిల్లాల వారికి రిజిష్ర్టేషన్లు కూడా జరిగిపోయినట్లు సమాచారం. వారి రిజిష్టర్ భూములుకు ఇదే కార్యాలయంలో తిరిగి ఆన్‌లైన్లో ఎక్కిస్తున్నారు. ప్రభుత్వ భూమి పంపిణీ చేయగా మిగిలిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. కాని ఇక్కడ ఆలా జరగలేదు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు మిగిలి ఉన్నాయో గుర్తించి వాటిని ఇతరులకు ఎకరాకు ఇంత చొప్పున తీసుకొని వారిపేరు మీద ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో వారి వారి పేర్ల మీద ఆర్‌ఓఆర్, ఆడంగల్ లు రావడంతో రైతు బంధు కింద కూడా వేలాది రూపాయాలను అప్పనంగా మింగేసినట్లు తెలుస్తోంది. సర్వే నెంబర్ 504,507అ,507ఈ,689అ,690/1,690/2/1690/1/3693,695/2,695/3696,698/1/1698/2,699/1699/3/1,699/1,698/3/2,700,లో 1,2,3 వంటి సర్వేనెంబర్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భూములతో పాటు వందలాది ఎకరాల భూములు పరుల పాలయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.మంథం గోడు, తదితర చుట్టు పక్కన గ్రామాల్లో వందల కొలది ఉన్న ప్రభుత్వ భూమిని ఆ తహసీల్దార్ అప్పనంగా ఇతరకు ఇవ్వడంపై స్థానికకులు ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నారు. మంథనిగోడు గ్రామానికి చెందిన దళారి ఇందులో కీలక పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ భూములకు మంచి డిమాండ్ ఉండడంతో కర్నాటకకు చెందిన బడా వ్యాపారస్తులకు కమీషన్ కింద మాట్లాడుకొని ప్రభుత్వ భూములను ఇప్పించడం వెనుక కీలకంగా ఉన్నట్లు సమాచారం. ఆ దళారే ప్రభుత్వ భూమని 20 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది.తన బార్య పేరిట,ఇతరుల పేరట తీసుకున్నట్లు సమాచారం.

సమగ్ర విచారణ జరిపితే వందల ఎకరాల గుట్టు రట్టు కావచ్చు
మఖ్తల్ తహసీల్ పరిధీలోని ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిగితే వందల ఎకరాల కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి వెనుక ఉన్న పాత్రధారులు,సూత్రధారులు బాగోతాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి.అవినీతి ఊబిలో ఇరుకున్న తహసీల్దార్ ఈ భూముల కుంభకోణంలో కోటి రూపాయలకు పైగా వెనుకేసుకున్నట్లు ఆరోపణలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కుల,నివాసం,పట్టాదారు పాసుపుస్తకం, తదితర చిన్న చిన్న దరఖాస్తులకు వారం రోజులు తిప్పించుకనే తహసీల్దార్ వందలాది ప్రభుత్వ భూములను తారు మారు చేయడంతో ఎంతో ఉత్సాహం చూపించినట్లు చెబుతున్నారు. అనతి కాలంలోనే ఆయనతో పాటు వెనుక ఉన్న సిబ్బంది కూడా అవినీతిలో చేతులు తడిపినిట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ ఇక్కడితో ముగిసిపోయేలా పై స్థాయిలో ఆ తహసీల్దార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కలెక్టర్ రొనాల్డ్ రోజ్ రికార్డులను తనఖీలు నిర్వహించారు. ఈ మక్తల్ సంఘటనపై సిఐడి, ఎసిబి అధికారులతో విచారణ జరిపితే వందలాది ప్రభుత్వ భూములు వెలుగులోకి అవకాశాలు ఉన్నాయి.

Related Stories: