దరఖాస్తులపై ప్రత్యేక కలెక్టర్

Special Collector on Applications

మన తెలంగాణ/ కొత్తగూడెం కలెక్టరేట్: ప్రభుత్వ భూ ముల ఆక్రమణలను మాత్రమే పరిశీలిస్తామని, పట్టాదా ర్ భూముల తగాదాలు వ్యక్తిగతంగానే పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్  రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన పలు విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను పరిష్కారం నిమిత్తం ఆ యా శాఖలకు సిఫార్సు చేయడమైందన్నారు. దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి వారి అర్హతను బట్టి లబ్ధిదారులకు వర్తిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రాంకిషన్, డిఆర్‌డిఓ జగత్‌కుమార్‌రె డ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments