త్వరలో ఎన్నికల తేదీలు!

రేపు సిఇసి బృందం రాక రెండు రోజుల పర్యటన, పార్టీలతో భేటీ కేంద్ర బృందం నివేదిక అందిన తరువాత తేదీల ఖరారు నేడు ఢిల్లీకి రాష్ట్ర సిఇఒ రజత్‌కుమార్ 31 జిల్లాలు 2.61 కోట్ల మంది ఓటర్లు 32,574 పోలింగ్ కేంద్రాలు 44.700 ఇవిఎంలు 44 వేల వివిపిఎటిలు ఖర్చు రూ. 308 కోట్లు షెడ్యూల్ ప్రకటనకు ముందస్తు ప్రక్రియ వేగవంతం చేసిన ఇసి మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను […]

రేపు సిఇసి బృందం రాక
రెండు రోజుల పర్యటన, పార్టీలతో భేటీ
కేంద్ర బృందం నివేదిక అందిన తరువాత తేదీల ఖరారు
నేడు ఢిల్లీకి రాష్ట్ర సిఇఒ రజత్‌కుమార్

31 జిల్లాలు
2.61 కోట్ల మంది ఓటర్లు
32,574 పోలింగ్ కేంద్రాలు
44.700 ఇవిఎంలు
44 వేల వివిపిఎటిలు
ఖర్చు రూ. 308 కోట్లు

షెడ్యూల్ ప్రకటనకు ముందస్తు ప్రక్రియ వేగవంతం చేసిన ఇసి

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు, అధ్యయ నం చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌లోని సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం మంగళవారం నగరానికి చేరుకోనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సి బ్బంది సమాయత్తం, ఓటర్ల జాబితా ప్రక్రి య, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పారా మిలిటరీ బలగాల లభ్యత వంటి అనేక అంశాలపై కేంద్రబృందం అధ్యయనం చేయనుంది. రాష్ట్రం లో గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించి ఆ తర్వాత రోజున ప్రధాన కార్యదర్శి, డిజిపి, అన్ని జిల్లాల కలెక్టర్లతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల నిర్వహ ణ, సన్నద్ధత తదితరాలపై నివేదిక రూపొందిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్ల గురించి, తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఎన్నికల కమిషనర్‌లతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్
సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ యంత్రాలను సమకూరుస్తూనే మరోవైపు హర్యానాలోని పంచకుల నుంచి కొన్ని ఇవిఎంలు, వివిపిఏటిలు నగరానికి చేరుకుంటున్నాయి. మొదటి విడత యంత్రాలు కొమురంభీం అసిఫాబాద్ జిల్లాకు చేరనున్నాయి. సోమవారం నుంచే వీటి రవాణా షురూ అవుతుందని, వారం పది రోజుల్లోనే రాష్ట్రానికి అవసరమైన మొత్తం సమకూరుతాయని రజత్‌కుమార్ వివరించారు.
మొత్తం 32,574 పోలింగ్ కేంద్రాలు :
ఎన్నికల నిర్వహణ, ఢిల్లీ పర్యటన, కేంద్ర బృందం హైదరాబాద్ పర్యటన గురించి రాష్ట్ర సిఇఓ రజత్‌కుమార్ ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఓటర్లజాబితాపై స్పష్టతవచ్చిందని, సోమవారం ముసాయిదా జాబితా విడుదలవుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిపై మరికొంత స్పష్టత రావాల్సి ఉందని, అదనపు సిఇఓతో పాటు ఇద్దరు డిప్యూటీ సిఇఓలు, ఒక సంయుక్త సిఇఓ బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ఎన్నికలకు సుమారు రూ. 308 కోట్లు ఖర్చు కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు రజత్‌కుమార్ తెలిపారు.
వారం రోజుల్లో రాష్ట్రానికి ఇవిఎంలు, వివిపిఏటి యంత్రాలు సమకూరుతున్నందున ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ప్రయోగాత్మక వినియోగ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు ఉండవచ్చని ప్రస్తుత జాబితా ప్రకారం ఒక అంచనా వచ్చిందని, ఇందుకోసం 32,574 పోలింగ్ కేంద్రాలు అవసరమని తెలిపారు. 44,700 ఇవిఎంలు, 44 వేల వివిపిఏటి యంత్రాలు పోలింగ్ కోసం బిఇఎల్ సిద్ధంచేసిందని తెలిపారు. ఇప్పటివరకు పూర్వ 10 జిల్లాల్లో ఇవిఎం, వివిపిఏటి మిషన్లను భద్రపర్చేందుకు కార్యాలయాలు, గోడౌన్లు ఉన్నాయని, కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో ఇప్పుడిప్పుడే కార్యాలయాలను గుర్తించినట్లు తెలిపారు.
భద్రత చర్యలు మరింత పటిష్టం
తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని, గత 2014 ఎన్నికల్లో ఎక్కడా అల్లర్లు జరగలేదని రజత్‌కుమార్ తెలిపారు. అయితే శాంతిభద్రతల నిర్వహణకోసం డిజిపి ఆధ్వర్యంలో ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి సూచించినట్లు తెలిపారు. డిజిపి ఆధ్వర్యంలో భద్రతా చర్యలు ఉంటాయని తెలిపారు. జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ అధికారులను బృందాలుగా ఏర్పర్చి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు కలెక్టర్లకు ఆదేశాలు పంపినట్లు తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ కోసం బూత్‌లవారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించేందుకు నివేదికలు సిద్ధమయ్యాయని చెప్పారు. సపోర్టింగ్ అధికారులను నియమించడంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అవసరమైన సిబ్బంది కేటాయింపులు కూడా జరిగాయని తెలిపారు. అలాగే ప్రత్యేకంగా ఈ ఎన్నికల కోసం ఒక ఐటి అధికారిని కూడా నియమించే ఆలోచన ఉందని చెప్పారు. ఎక్కడ ఇవిఎంలు మొరాయించినా తక్షణం స్పందించి చక్కదిద్దేందుకు ఐటి అధికారి నేతృత్వంలో నిపుణులు సిద్ధంగా ఉంటారన్నారు.
రేపు హైదరాబాద్‌కు రానున్న కేంద్ర బృందం
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల ప్రత్యేక బృందం మంగళవారం హైదరాబాద్ రానుంది. ఉదయం నుంచీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తారని, సాయంత్రం 5.30 గంటలకు గుర్తింపు పొందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశమవుతుందని రజత్‌కుమార్ తెలిపారు. రాత్రి తెలంగాణ శాసన సభ ఎన్నికల నిర్వహణపై తాను కేంద్ర ఎన్నికల కమిషన్ బృందానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఉదయం 10 గంటలకు కేంద్ర బృందం జిల్లా కలెకర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షిస్తుందని, ఆ తర్వాత ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కె జోషితో సమావేశమవుతుందని తెలిపారు.
నేడు ఢిల్లీకి రజత్ కుమార్
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటివరకు జరిగిన ప్రక్రియను వివరించేందుకు రాష్ట్ర సిఇఓ రజత్ కుమార్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన తోపాటు ఐదుగురు ప్రతినిధులు కూడా వెళ్ళనున్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లతో ఆయన సమావేశమై పూర్తి వివరాలను తెలియజేయడంతో పాటు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో శాంతిభద్రతలు, ఎన్నికల నిర్వహణ, ఖర్చు, నియమావళిపై సుధీర్ఘంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Comments

comments

Related Stories: