త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్

ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘అరవింద సమేత’ కోసం తన మేకింగ్ స్టైల్‌ను, రైటింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా రెండో టీజర్‌ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై చిత్ర బృందం తాజాగా ట్విట్టర్ […]

ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘అరవింద సమేత’ కోసం తన మేకింగ్ స్టైల్‌ను, రైటింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా రెండో టీజర్‌ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై చిత్ర బృందం తాజాగా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. “అరవింద సమేత చిత్రం ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రెండో టీజర్ కూడా రాబోతోందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇక త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నాం”అని ఫిల్మ్‌మేకర్స్ తెలియజేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.

Related Stories: