తొగుట రూపు రేఖలు మారుస్తా

రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మన తెలంగాణ/ తొగుట: తొగుట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వాటి రూపు రేఖలు మారుస్తానని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. బుధవారం తొగుట మండలంలోని నూతనంగా గ్రామ పంచాయతీ భవనాన్ని శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి రూ.1లక్షా116 అందించడం నిరుపేదలకు వరంలాంటిదన్నారు. గోదావరి నీటిని మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా చేయడం […]

రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి

మన తెలంగాణ/ తొగుట: తొగుట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వాటి రూపు రేఖలు మారుస్తానని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. బుధవారం తొగుట మండలంలోని నూతనంగా గ్రామ పంచాయతీ భవనాన్ని శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి రూ.1లక్షా116 అందించడం నిరుపేదలకు వరంలాంటిదన్నారు. గోదావరి నీటిని మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా చేయడం కెసిఆర్‌తోనే సాధ్యమైందన్నారు. రైతు బీమా ఐదు లక్షలు, రైతు పెట్టుబడికి ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న తహసీల్దార్ భవనాన్ని రూ.20లక్షలతో పూర్తిగా నిర్మించాలని అధికారులకు సూచించారు. పూర్తి కాని శ్మశాన వాటికలకు నెలలోగా పూర్తి చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. ముంపుగ్రామాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్‌కు ఫోన్‌లో తెలుపగా సానుకూలంగా స్పందిస్తూ సానుకూలంగా స్పందించారు.

పోలీస్ స్టేషన్‌లో  డ్రైనేజీ కాల్వ లేకపోవడంతో నీరురోడ్డుపైకి వస్తున్న నీటి ద్వారా చుట్టు పక్కల ఇండ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుపగా పోలీస్‌స్టేషన్ పరిధిలో వెంటనే పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించాలనా ఎస్పీ పర్మిషన్ తీసుకొవాలని ఆదేశించారు. గతంలో తొగుట మండలంలో తాగునీటి సమస్య ఉండేదని కాని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని , మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరణ చేశామని తెలిపారు. అనంతరం వెంకట్రామ్‌పేట గ్రామంలో డబుల్ బెడ్‌రూంల సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తొగుట మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, రైతు సమన్యయ మండల కన్వీనర్ ఎల్పుల స్వామి, నిరంజన్, నరేందర్‌రెడ్డి,  రవిందర్, గ్రామసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ సుజాత రమేశ్, టీఆర్‌ఎస్ నాయకులు రాంరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: