తెలుగు హీరోయిన్ తో విశాల్ పెళ్లి..?

Vishal's wedding with Telugu heroine Sri Divya?

చెన్నై: టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ చాలా మంది మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్ హీరోలు ఉన్నారు. కోలీవుడ్ లో ఈ జాబితాలో అందరికంటే ముందు ఉన్న హీరో విశాల్. తమిళ్ తో పాటు తెలుగులోనూ విశాల్ కు మంచి ఫ్యాన్ ఫాలోవింగ్ ఉంది. ఆయన నటించిన పందెం కోడి, అభిమన్యుడు తదితర చిత్రాల్లో తెలుగులోనూ మంచి విజయాలు సాధించాయి. ఇక తమిళనాడులో సెటిల్ అయినా విశాల్ ఫ్యామిలీ తెలుగువారు అనే విషయం తెలిసిందే. అతడికి ఇప్పటికే 40 ఏళ్లు వచ్చేశాయి. దీంతో విశాల్ తొందరగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విశాల్ పెళ్లిపై జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతో విశాల్ ప్రేమాయణం నెరిపిన సంగతి తెలిసిందే. అయితే, శరత్ కుమార్ తో విభేదాల కారణంగా వీరిద్దరూ దూరమయ్యారు.

Vishal's wedding with Telugu heroine Sri Divya?

ఇప్పుడు విశాల్ ఓ తెలుగు హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నాడనే వార్త సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె విశాల్ తో కలిసి నటించింది కూడా. తెలుగులోనూ రెండు మూడు మంచి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు. మనసారా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీ దివ్య. బాలనటిగా కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించిందామె. తమిళ్ లోనూ కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. విశాల్ తో కలిసి రాయుడు మూవీలో దివ్య కథనాయికగా నటించింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నరని కోలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. కానీ, దీనిపై అటు విశాల్ ఫ్యామిలీ నుంచి గానీ, ఇటు దివ్య కుటుంబం నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీంట్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Comments

comments