తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ : కవిత

mp-kavitha

జగిత్యాల: జగిత్యాల మండలంలోని గుట్రాజ్‌పల్లెలో గురువారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని టిఆర్‌ఎస్ ఎంపి కవిత ఆవిష్కరించారు. అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు రూ. 32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాల భవనాలకు ఎంపి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జగిత్యాల నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇంచార్జీ సంజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌రావు, జడ్పిటిసి నాగలక్ష్మి, ఎఎంసి చైర్‌పర్సన్ ప్రియాంక, గుట్రాజ్‌పల్లి సర్పంచ్ విజయలక్ష్మితో పాటు పలువురు ఎంపిటిసిలు హాజరయ్యారు.