జగిత్యాల : కల్లెడ గ్రామంలో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత సోమవారం పర్యటించారు. ఈ సంద్భంగా ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్పి చైర్మన్ తుల ఉమతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. గ్రామంలో మసీదు, శ్మశాన వాటికతో పాటు అన్ని కుల సంఘాలకు భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు. బంగారు తెలంగాణ స్థాపనే ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారని ఆమె కొనియాడారు.