తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళి

Rahul Gandhi paid tribute to Telangana martyrs in Gun Park
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటలో భాగంగా మంగళవారం గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. తరువాత సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రజా చైతన్య బస్సులో రాహుల్ ప్రయాణం చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆ బస్సు ఎక్కారు. అయితే… కాంగ్రెస్ శ్రేణులు గన్ పార్క్ వద్దకు భారీగా చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసుల నడుమ తోపులాట జరిగింది.