తెలంగాణ అభివృద్ధిని చూసే టిఆర్‌ఎస్‌లో చేరిక

Join the TRS to see Telangana growth

రైతుబంధు రైతుబీమాతో అన్నదాత సంబరాలు
నిరంజన్‌రెడ్డి సమక్షంలో 300 మంది ఇతర పార్టీ నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరిక
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/వనపర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ చేస్తున్న పలు అభివృద్ధి పనులు, పలు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందు తూ రైతుబంధు, రైతుబీమాతో రైతులు తెలంగాణలో సంబరాలు చేసుకుం టున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండల పరిధిలోని అప్పాయపల్లి గ్రామంలో ఆదివారం టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి  సమక్షంలో టిడిపి సర్పంచ్ విష్ణుతో సహా కాంగ్రెస్,టిడిపి సీనియర్ నాయకులు ,కార్యకర్తలు 300 టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పెబ్బేరు మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామానికి చెం దిన బిజెపి నాయకులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో 25 మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. వనపర్తి మండలంలోని మర్రికుంటకు  చెందిన 60 మంది టిడిపి,కాంగ్రెస్ నాయకులు  నిరంజన్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా పార్టీ కార్యకర్తలకు కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడు తూ  సిఎం కెసిఆర్  రైతుబంధు పథ కాన్ని ప్రారంభించి రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చారని, రైతు క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ,భారత దేశ చరిత్రలోనే రైతుబంధు పథకం ఒక సువర్ణాధ్యాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.  గత 60 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సిఎం కెసిఆర్ అండగా ఉంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పథకాన్ని రైతుల క్షేమం కోసం రైతు ఆర్థికాభివృధ్ది కోసమేరైతు బంధు పథకం ప్రారంభించారన్నారు. దేశంలో ఎక్కడా లేని  విధంగా సిఎం కెసిఆర్ ఈ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతు ఆర్థికాభివృద్ధి చెందేందుకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగు తుందని రెండు పంటలకు కలిపి రైతుకు సంవత్సరానికి రూ. 8వేల ను అందజేస్తామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతాంగానికి ఆశాకిరణం రైతుబంధు పథకం   రైతు బంధు పథకాన్ని అమలు చేశారన్నారు. ఇది   దేశంలోనే చారిత్రాత్మక పథకమని ఆయన పేర్కొన్నారు. గత 60 సంవత్సరాలనుండి ప్రభుత్వాలు రైతులకు వెన్నెముకగా ఉంటామని చెప్పిన ప్రభుత్వాలు రైతులకు ఏమి చేయలేక పోయిందన్నారు. గత నాల్గు సంవత్సరాల నుండి సిఎం కెసిఆర్ రైతులకు అండగా ఉంటూ రైతులకు వెన్నెముకగా నిలిచి ఈ రైతు బంధు పథకాన్ని ప్రారంభించారన్నారు.  వేరుశనగ పంటలతో పాటు, వరి పంటలతోపాటు అధిక దిగుబడులు వచ్చే పంటలను  రైతులు సాగుచేయాలని ఆయన కోరారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపిపి శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు గట్టుయాదవ్, కౌన్సిలర్లు లోక్‌నాథ్‌రెడ్డి, వాకిటి శ్రీధర్, మాజి జడ్పిటిసి వెంకట్‌రావు ,ఎస్టీసెల్ అధ్యక్షులు శేఖర్ నాయక్, సర్పంచ్ విష్ణు, మాణిక్యం, వెంకటేశ్వర్‌రెడ్డి,కురుమూర్తి, చిట్యాల రాము, రైతుసమన్వయ సమితి మండలాధ్యక్షులు నరసింహ్మ,బీచుపల్లి యాదవ్, సర్పంచ్ పాపిరెడ్డి, గ్రామ అధ్యక్షులు రాము, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments