తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు…

Rains in Telangana in the next two days

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు నగర వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 26 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే, ఉత్తర మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయువ్య మధ్యప్రదేశ్, పరిసరాల్లో అల్పపీడనం బలహీనపడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 3 రోజులపాటు రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.