తెలంగాణలో భారీ వర్షం

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  ఆదిలాబాద్‌, ఖమ్మం, మంచిర్యాల, వరంగల్‌, భూపాలపల్లి, నిర్మల్‌ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. అలాగే భాగ్యనగరంలో కూడా పలు చోట్ల వర్షం పడుతోంది.  ఆదిలాబాద్‌ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇచ్చోడలో అత్యధికంగా 14 సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా, ఇంద్రవెల్లి, జైనథ్‌ మండలాల్లో 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం […]

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  ఆదిలాబాద్‌, ఖమ్మం, మంచిర్యాల, వరంగల్‌, భూపాలపల్లి, నిర్మల్‌ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. అలాగే భాగ్యనగరంలో కూడా పలు చోట్ల వర్షం పడుతోంది.  ఆదిలాబాద్‌ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇచ్చోడలో అత్యధికంగా 14 సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా, ఇంద్రవెల్లి, జైనథ్‌ మండలాల్లో 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related Stories: