తెలంగాణను అగ్ర స్థానంలో నిలపడమే నా లక్ష్యం…

సిద్ధిపేట : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే దిశగా తాను సాగుతున్నానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, మరణం అంచుల వరకు వెళ్లి తెలంగాణను సాధించానని కెసిఆర్ పేర్కొన్నారు. ఉద్యమం సమయంలో చిత్తశుద్ధితో రాజీనామాలు చేసింది టిఆర్ఎస్ నాయకులేనని ఆయన చెప్పారు. తెలంగాణను ఢిల్లీ బాసుల చేతుల్లో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మన రాజకీయ నిర్ణయం మన చేతుల్లోనే ఉండాలని తాము చెబుతున్నామని చెప్పారు. ఢిల్లీకి గులాంల […]

సిద్ధిపేట : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే దిశగా తాను సాగుతున్నానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, మరణం అంచుల వరకు వెళ్లి తెలంగాణను సాధించానని కెసిఆర్ పేర్కొన్నారు. ఉద్యమం సమయంలో చిత్తశుద్ధితో రాజీనామాలు చేసింది టిఆర్ఎస్ నాయకులేనని ఆయన చెప్పారు. తెలంగాణను ఢిల్లీ బాసుల చేతుల్లో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మన రాజకీయ నిర్ణయం మన చేతుల్లోనే ఉండాలని తాము చెబుతున్నామని చెప్పారు. ఢిల్లీకి గులాంల లేక్క కాకుండా, తెలంగాణకు గులాబీల్లా ఉందామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలని, సామంతులుగా కాదని చెప్పుకొచ్చారు. హుస్నాబాద్ సభలో మాట్లాడిన కెసిఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ ప్రజల ఆశీస్సులతో తాను యుద్ధానికి బయల్దేరుతున్నానన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కెసిఆర్ చెప్పారు. కోటి ఎకరాలకు సాగు నీటిని అందించడమే తన టిఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తన ఆకాంక్ష అని కెసిఆర్ అన్నారు. టిఆర్ఎస్ పాలనతో ప్రజలకు  భరోసా కలిగిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎన్నో ఆరోపణలు చేస్తుంది. కానీ, ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాలని కెసిఆర్ కోరారు.

Comments

comments

Related Stories: