తెలంగాణకు ఏడు అవార్డులు

ప్రదానం చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
రాష్ట్రం తరఫున అందుకున్న కమిషనర్
నీతూ ప్రసాద్, అధికారులు

Awards

మన తెలంగాణ / హైదరాబాద్, న్యూఢిల్లీ : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు ఏడు జాతీయ అవార్డులను ప్రధానం చేసిం ది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం పంచాయతీరాజ్ కమీషనర్ నీతూ ప్రసాద్, ఆ శాఖకు చెందిన అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ విభాగాల్లో మెరుగైన పనితీరు కనబర్చినందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రా ష్ట్రాలకు అవార్డులను ప్రకటించగా తెలంగాణకు ఏడు లభించాయి. గతంలోనూ ఇదే తరహా జాతీయ అవార్డులు లభించాయి. ఈ ఏడాది ఒకేసారి ఏడు అవార్డులు అందుకోవడం విశేషం. మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర ప్రో గ్రాం మేనేజర్లు దుర్గా ప్రసాద్, శేషు కుమార్, మురళీధర్, కృష్ణ మూర్తి తదితరులతో పాటు వివిధ జిల్లాల నుంచి నర్సింగ రావు హాజరైనారు. ‘రూర్బన్’ పథకం అమలుకు సంబంధించి తెలంగాణ తరఫున శేఖర్, నర్సింహులు ఈ కార్యక్రమానికి హాజరై కేంద్ర మంత్రి నుంచి అవార్డులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏడు అవార్డులకు ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్నిరోజుల ముందే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సమాచారం అందించింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్య కార్యదర్శి ఈ అవార్డులు రావడంపట్ల సంతోషం వ్యక్తం చేసి సిబ్బందిని, అధికారులను అభినందించారు. తెలంగాణకు ఈ క్రింది విభాగాల్లో అవార్డులు లభించాయి :

పారదర్శకత మరియు జవాబుదారీతనం విభాగం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను ఎం పిక చేయగా అందులో తెలంగాణకు మొదటి స్థానం లభించింది. ఈ అవార్డును రాష్ట్ర పం చాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్, బి.సైదులు కలిసి అందుకున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సుపరిపాలన విభాగంలో దేశం మొత్తం మీద రెండవ స్థానం లభించింది. ఈ అవార్డును కూడా వీరిద్దరే అందుకున్నారు.
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ‘రూర్బన్ మిషన్’ అమలులో దేశంలో రెండు రాష్ట్రాలు ‘అత్యుత్తమ పురస్కారం’కు ఎంపిక కాగా అందులో ఒకటి గా ఉన్న తెలంగాణ తరఫున కమిషనర్ నీతూ ప్రసాద్, ఐఎఫ్‌ఎస్ అధికారి ఎస్.జె ఆశా కలిసి అందుకున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు జిల్లాల విభాగంలో దేశవ్యాప్తంగా 18 జిల్లాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణలో వికారాబాద్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తరఫున సయ్యద్ ఒమర్ జలీల్, జాన్సన్‌లు అందుకున్నారు. కామారెడ్డి జిల్లా తరపున కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, డిఆర్‌డిఓ చంద్ర మోహన్‌రెడ్డి అందుకున్నారు.
గ్రామీణ జిల్లాలలో సమర్థవంతంగా శిక్షణ కల్పించినందుకు స్టేట్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఐఆర్‌డి)కు లభించిన అవార్డును ఆ ఇన్‌స్టిట్యూట్ కమిషనర్ పౌసమీ బసు అందుకున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు దేశవ్యాప్తంగా 18 గ్రామ పంచాయితీలను ఎంపికచేయగా తెలంగాణ తరఫున ఎంపికైన సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీ తరఫు న ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్.రాజు, పంచాయతీ కా ర్యదర్శి ఎం.జీవన్‌రెడ్డి, ఎం.పి.డి.ఓ. కె.సమ్మిరెడ్డి అందుకున్నారు.
ఉపాధి హామీ పథకం కూలీలకు సకాలంలో నగదు చెల్లింపులు చేసిన విభాగంలో మెదక్ జిల్లా శంకరంపేట సిబ్బంది అందుకున్నారు.

గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి

గ్రామాలు అభివృద్ధి చెందితేనే  మొత్తం దేశం అభివృద్ధి పథంలో ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాలకు పలు విభాగాల్లో అవార్డులను ప్రదానం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అందువల్లనే ప్రతీ ఏటా వార్షిక బడ్జెట్‌లో కోట్లాది రూపాయలను అభివృద్ధి పనుల కోసమే కేటాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో విద్య, పారిశుద్యం, టెక్నాలజీ ఉంటే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

Comments

comments