తాడాటతో కండర పుష్టి

Skipping Rope Exercise for a Killer Body

చిన్నపిల్లలు తాడాట ఆడుతూ ఉంటారు. దాంట్లో వివిధ పద్ధతులు ఉంటాయి. ఎవరికి నచ్చిన రీతిలో వారు ఆడుకుంటూ ఉంటారు. ఇది ఒక ఆటే అయినా మంచి వ్యాయామం అవుతుంది. ఇప్పుడు జిమ్‌లలో కూడా దీనిని పెడుతున్నారు. దీంతో గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని పెరుగుతుంది. రక్తం గుండె నుంచి ఇతర భాగాలకు చక్కగా సరఫరా అవుతుంది. ప్రాణవాయువు శరీరమంతా అందుతుంది.
కండరాలు అన్నీ గట్టిపడతాయి. ఆట మొదలుపెట్టినప్పుడు కాళ్ళు నొప్పులు వస్తాయి. కొద్దిగా విరామం ఇస్తూ సమయం పెంచుకుంటూ వెళ్లాలి.
రోజూ పదిహేను నిముషాల పాటు తాడాట ఆడటం వల్ల శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దాంతో చర్మం కూడా ఆరోగ్యంగా, తాజాగా కనిపిస్తుంది. ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. బరువు తగ్గడం తేలిక. దాదాపు గంటసేపు ఆడటం వల్ల దాదాపు 300 కెలొరీ లు ఖర్చవుతాయి. ఈ వ్యాయామాన్ని రోజూ చేస్తే మంచిది. ఎక్కడికైనా స్కిప్పింగ్ రోప్స్‌ను తీసుకెళ్ళి చక్కగా వ్యాయామంతో కండరాలను దృఢపరచుకోవచ్చు.

Comments

comments