తల్లీకుమారుడి దారుణ హత్య..!

అమరావతి: ఎపిలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజాపురం గ్రామంలో దారుణం జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ తల్లి, కొడుకును అతి కిరాతకంగా రాళ్లతో కొట్టిచంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజాపురం గ్రామ శివారులోని కొండగట్టుపై రెండు మృతదేహాలు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తల్లీకుమారుడి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు […]

అమరావతి: ఎపిలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజాపురం గ్రామంలో దారుణం జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ తల్లి, కొడుకును అతి కిరాతకంగా రాళ్లతో కొట్టిచంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజాపురం గ్రామ శివారులోని కొండగట్టుపై రెండు మృతదేహాలు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తల్లీకుమారుడి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: