తపాలా బ్యాంక్ ప్రారంభం

ఇక ఇంటివద్దకే చెల్లింపులు  న్యూఢిల్లీ : తంతితపాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వినూత్న నగదు చెల్లింపుల బ్యాంక్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) పేరిట ఈ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు, దీనితో ప్రజల గుమ్మంవద్దకే బ్యాంకింగ్ వ్యవస్థ చేరనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశవ్యాప్తంగా తంతితపాలాశాకు ఉన్న దాదాపు 3 లక్షల మంది పోస్టుమెన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌ల సాయంతో ఈ ఇంటింటికి ప్రజల పొదుపు సొమ్ము చెల్లింపులు జరుగుతాయి. […]

ఇక ఇంటివద్దకే చెల్లింపులు 

న్యూఢిల్లీ : తంతితపాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వినూత్న నగదు చెల్లింపుల బ్యాంక్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) పేరిట ఈ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు, దీనితో ప్రజల గుమ్మంవద్దకే బ్యాంకింగ్ వ్యవస్థ చేరనున్నట్లు ప్రధాని తెలిపారు. దేశవ్యాప్తంగా తంతితపాలాశాకు ఉన్న దాదాపు 3 లక్షల మంది పోస్టుమెన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌ల సాయంతో ఈ ఇంటింటికి ప్రజల పొదుపు సొమ్ము చెల్లింపులు జరుగుతాయి. ఐపిపిబి ఇతర బ్యాంకుల తరహాలోనే పనిచేస్తుంది. అయితే రుణాల జారీ వంటివి లేకుండా చిన్న తరహాలో పనిచేస్తుంది. అయితే డిపాజిట్లు తీసుకోవడం వంటి పలు బ్యాంకింగ్ కార్యకలాపాలు జరుపుతుంది. రుణాల మంజూరీ జోలికి పోవడం లేదు. అదే విధంగా క్రెడిట్ కార్డుల జారీ కూడా ఉండదు. రూ లక్ష వరకూ డిపాజిట్లను ఈ తపాలా బ్యాంకు స్వీకరిస్తుంది. ప్రధానమైన అంశం నేరుగా చెల్లింపులను చేపట్టమే. ఈ బ్యాంకు సేవలు ఈ విధంగా ఉంటాయి.

చెల్లింపుల సేవలు, మొబైల్ చెల్లింపులు, నగదు బదిలీ, కొనుగోళ్లు దీనితో పాటు ఎటిఎం, డెబిట్ కార్డుల వంటి బ్యాంకింగ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, థర్డ్ పార్టీ నిధుల బదిలీలు వంటి పలు అంశాలు ఇందులో ఉంటాయని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇక ఐఐపిబి దేశవ్యాప్తంగా 650 శాఖలు, 3250 నిర్వాహక కేంద్రాలతో ప్రజలకు అందుబాటులో ఉం టు ందని వెల్లడించారు. రూ. లక్షకు మించిన నగదు డిపాజిట్ జరిగితే ఎక్కువ మొత్తం వెనువెంటనే పోస్టు ఆఫీసు పొదుపు ఖాతాలలోకి బదిలీ అవుతుందని మంత్రి వివరించారు. ఐఐపిబి వందశాతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉం టుంది. భారత తంతితపాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.పలు యాప్‌లను కూడా సమకూరుస్తుంది. ఆధార్ ద్వారానే ఖాతాలు తెరిచేందుకు వీలుంటుంది.లావాదేవీలను నిర్వహించే గ్రామీణ్ డాక్ సేవక్‌లకు స్టార్ట్‌ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలు సమకూరుస్తారు.ఈ బ్యాంకులలో పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు 4శాతంగా ఉంటుంది.

Comments

comments

Related Stories: