తండ్రి కొడుకుల ఆత్మహత్యల అంత్యక్రియలలో ఉద్రిక్తత

Tension in the funeral of the suicide of father's son
వివాదస్పద భూమి లోనే పుడ్చిపెట్టాలని గుంతలో బైఠాయింపు

ఇల్లంతకుంట: దళిత కుటుంబానికి చెందిన తండ్రి కొడుకుల ఆత్మహత్యల అంత్యక్రియలలో ఉద్రిక్తత వాతవరణం చోటుచేసుకుంది. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామానికి చెందిన సావపెల్లి ఎల్లయ్య (50), సావపెల్లి శేఖర్(21) హత్యకు గురయ్యారు. గత 48 గంటలుగా మృతదేహాలతో న్యాయం కావాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తరోకో నిర్వహించారు. చివరకు అధికారులు వచ్చి అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. చివరకు అంత్యక్రియలు వివాదస్పద భూమిలోనే చేయ్యాలని మృతుల బంధువులు సూచించారు. అధికారులు కూడా మొదటగా ఒప్పుకున్నారు. దీంతో వివాదస్పద భూమిలో రెండు గుంతలను తీశారు. కానీ మళ్లి వాటిని పుడ్చిపెట్టారు. పక్కన కొంత దూరంలో మళ్లి రెండు గుంతలు తీశారు. మృతులను ఇందులో పుడ్చిపెట్టాలని సూచించారు. కానీ మృతుల బంధువులు దీనికి ససేమిరా అన్నారు. మాకు మొదట తీసిన గుంతలలోనే పుడ్చిపెడుతామని లేదంటే మమ్మల్ని పుడ్చండంటూ గుంతలో దిగి నిరసన తెలిపారు. దీంతో ఒక్క సారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే, డిఎస్పి వెంకటరమణా, ఆర్డిఒ పాండురంగ సంఘటనను పరిశీలిస్తున్నారు.

Comments

comments