తండ్రిని హతమార్చిన తనయలు

సింగరేణి వారసత్వ కొలువుపై కొట్లాట పర్యవసానం

Father-Kille-d

మంచిర్యాల టౌన్: రెండు మాసా ల్లో సింగరేణిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్న  కన్న తండ్రి వారసత్వ కొలువు విషయంలో కుమార్తెలిద్దరు గొడవ పడి చివరికి తలపై రోకలిబండతో మోది అతడిని హత్య చేసిన ఘటన మంచిర్యాల చోటు చేసుకున్నది. హత్యను ప్రమాదంగా చిత్రకరించేందుకు చివరి వరకు ప్రయత్నించిన హంతకుల పన్నాగం కుటుంబ సభ్యులు ఇచ్చిన  పోలీసు ఫిర్యాదుతో బట్టబయలైంది. సోమవారం వెలుగు చూసిన ఈ దారుణ సంఘటనకు సంబంధించి మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకా రం వివరాలివి. మంచిర్యాల పట్టణంలోని మారుతీనగర్(ఒడ్డెరకాలనీ)లో నివాసం ఉండే సొత్కు మహేందర్ (59) ఆర్‌కె 5 సింగరేణి గనిలో విధు లు నిర్వహిస్తున్నాడు. సొత్కు మహేందర్‌కు భార్య వినోద, కూతుర్లు సౌజన్య, లావణ్యలు ఉన్నారు. కూతుర్లు ఇద్దరికీ వివాహం చేయగా రెండవ కూతురు భర్తతో గొడవల కారణంగా కన్నవారి దగ్గరే ఉంటుంది.  సొత్కు మహేందర్ మరో రెండు నెలల కాలంలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో తండ్రి రిటైర్మెంట్ అనంతరం వారసత్వ ఉద్యోగంతో పాటు అతని సంపాదన కోసం ఇం ట్లో గొడవలు మొదలయ్యాయి.

తన పదవీ విరమ ణ అనంతరం సంపద భార్యకు, కూతుర్లకు వస్తుందని మహేందర్ వారితో వాదించినప్పటికీ వారసత్వ ఉద్యోగం విషయంలో గొడవలు ముదిరిన ట్లు సమాచారం. పెద్ద కూతురు తన  భర్తకే ఉద్యో గం ఇవ్వాలని పట్టుబట్టి గొడవకు పాల్పడేదని తెలుస్తోంది. ఇదే విషయమై  ఆదివారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యుల మధ్యతీవ్ర స్థాయిలో గొడవకు దారి తీసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మహేందర్ తన భార్యతో చర్చిస్తుండగానే కూతుర్లు రోకలిబండతో తండ్రి తలపై అతడు సంఘటన స్థలంలోనే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన మహేందర్ మరణించినట్లు గ్రహించిన కూతుర్లు తల్లి సహాయంతో ప్రమాద సంఘటనగా చిత్రకరించేందుకు ప్రయత్నించారు. సోమవారం విషయం తెలిసిన బంధువులు ఇంటికి చేరుకొని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిఐ ఆకుల మహేష్ సంఘటన స్థలానికి చేరుకొని అనుమానం విచారణ చేయగా కూతుర్లు తాము చేసిన దారుణాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులోఉండగా పూర్తి స్థాయి విచారణ అనంతరం కేసు వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.

Comments

comments