జోగులాంబ గద్వాల : మతిస్థిమితం లేని ఓ యువకుడు తన తండ్రిని బండరాయితో మోది హత్య చేశాడు. ఈ ఘటన గుంటిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. గుంటిపల్లి గ్రామానికి చెందిన హన్మంతు (55), దేవమ్మలకు ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో మూడో కొడుకు రాముడికి మతిస్థిమితం లేదు. పిచ్చిగా ప్రవర్తిస్తుండడంతో ఇంట్టి వద్దనే ఓ దూలానికి కట్టేసేవారు. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి రాముడిని కట్టేయడం లేదు. మంగళవారం రాత్రి హన్మంతు ఇంటి వద్ద ఉన్న కట్టపై కూర్చుని ఉండగా, వెనుక నుంచి వచ్చిన రాముడు రాయితో తలపై మోదీ తీవ్రంగా గాయపర్చాడు. తక్షణమే హన్మంతును ఆస్పత్రికి తరలించారు. హన్మంతు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Young Man Killed his Father
Comments
comments