తండ్రిని చంపిన తనయుడు..

Son Killed His Father In Warangal District

చెన్నారావుపేట: కొడుకు చేతిలో తండ్రి చనిపోయిన సంఘటన మండలంలోని పాపయ్య పేట గ్రామంలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మేర్గు సంజీవ(59)గ్రామంలో నీరటి తనం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. వేసవి కాలంలో ఇక్కడ ఏమి పని లేకపోడంతో కుటుంబ పోషణ భారమై హైదరాబాద్‌కు వెళ్లి కూలి పని చేసి బ్రతికాడని తెలిపారు.వర్షాకాలం కావడంతో నీరటి పని ఉంటుందని స్వగ్రామమైన పాపయ్యపేటకు గురువారం వచ్చాడన్నారు. ఇంటికి వచ్చిన కొంది సమయానికే కుమారుడు నర్సయ్య తండ్రితో గొడవ పడి పారతో తలపై కొట్టడంతో సంజీవ అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జగదీశ్వర్ తెలిపారు.

Comments

comments